పవన్ నిజస్వరూపం వెళ్లగక్కిన పృథ్వీ

Tellmeboss.net

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తో పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో తెలీదు కానీ.. వ్యక్తిగతంగా మాత్రం తెలుగు ప్రజలందరి మనసుల్ని దోచుకున్నారు. స్టార్ హోదా ఉందనే పొగరు లేకపోవడం, నలుగురితో స్నేహంగా కలిసిపోవడం, తనకంటే చిన్నవారిని సైతం గౌరవించడం, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆపద్బాంధవుడిలా ఆదుకునే స్వభావం.. ఇలా ఆయన మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!

అందుకే.. ఈయన్ను సాధారణ ప్రేక్షకులే కాకుండా ఇండస్ట్రీలోనూ ఎందరో ఇష్టపడేవారున్నారు. ఆయన పేరు వినిపిస్తే చాలు.. గౌరవంతో గొంతు పులకరిస్తుంది, మనసు నుంచి ప్రేమ ఉప్పొంగుకొస్తుంది.. మంచి మాటలే నోటివెంట వస్తాయే తప్ప కళ్లల్లో నుంచి వ్యతిరేకత భావం ఏ ఒక్కరిలోనూ కనిపించదు. అంత గొప్ప స్థానం దక్కించుకున్నారు పవన్. అందుకు మరోసారి పృథ్వీ మాటలే నిదర్శనంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా ఓ వెబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన రాగా.. పృథ్వీ ఆనందంతో పులకరించిపోతూ ఆయన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Tellmeboss.net

‘పవర్ స్టార్’ అంటే ఏదో ఫ్యాన్స్ క్రేజీగా పిలుచుకునే పవన్ పవర్‌స్టార్ మాత్రమే కాదని, ఆయన నడిచే అగ్నిగోళమని పృథ్వీ అన్నాడు. పవన్‌ను తాను పొగడడం లేదని, వాస్తవాలే చెప్తున్నానని, మనసులోంచి వచ్చిన మాటలని ఆయన అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్‌ను తాను ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదని.. పవన్ వ్యక్తిత్వం-మంచితనం చూసి స్పందిస్తున్నాన్నాడు. అంతే తప్ప డబ్బా కొట్టడానికో, ఆయనతో సినిమాలు చేయడానికో మాత్రం కాదని పృథ్వి చెప్పుకొచ్చారు.

రీసెంట్‌గా ఓ సందర్భంలో కలిసినప్పుడు పవన్ పక్కన ఒక కూజా, ఒక మట్టిగ్లాసు ఉన్నాయని.. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ వ్యక్తో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని అన్నారు. పవన్‌ని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, మన ముందున్న మేధావులను మనం గుర్తించలేకపోతున్నామంటూ పవన్ గురించి చెప్పారు. పవన్ తనని ‘స్పురద్రూపి’ అని ప్రేమగా పిలుస్తారని పృథ్వీ చెప్పుకొచ్చాడు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.