పూరి ఆఫర్ ను అందుకే వద్దన్నాడట

R Narayana Murthy clear why he refused to act in Puri Jaganath film

ఆర్. నారాయణ మూర్తి… తెలుగు సినిమాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేని నటుడు. విప్లవ నేపథ్యంలో సినిమాలు చేసే నారాయణ మూర్తి తాజాగా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమా చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆర్ నారాయణ మూర్తి చేస్తున్న సినిమా కావడం, ఈ సినిమాలో రెగ్యులర్ గా కనిపించేలా కాకుండా మూర్తి గారు కొత్తగా కనిపించడం విశేషం. సంక్రాంతి నాడు ఈ సినిమా బరిలోకి దిగుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆర్. నారాయణ మూర్తి.. టెంపర్ లో హెడ్ కానిస్టేబుల్ పాత్ర కోసం పూరి తనని సంప్రదించిన మాట వాస్తవమేనని వివరించారు.

ఎన్టీఆర్ – పూరి కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘టెంపర్’. సూపర్ హిట్టయ్యింది. ఇందులో ఎన్టీఆర్, పోసాని నటన అద్భుతం. ఇందులో పోసాని కృష్ణమూర్తి పోషించిన హెడ్ కానిస్టేబుల్ పాత్ర కోసం ముందుగా ఆర్. నారాయణ మూర్తి అడిగామని, ఆయన రిజక్ట్ చేయడంతో ఆ పాత్రలో పోసానిని తీసుకొన్నట్టు అప్పట్లో స్వయంగా దర్శకుడు పూరినే తెలిపారు.ఇన్నాళ్లు కష్టపడి కథానాయకుడిగా ఎదిగానని,  ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం ఇష్టం లేకనే టెంపర్ ఆఫర్ ని వదులుకొన్నట్టు తెలిపారు నారాయణ మూర్తి. తనని అర్థం చేసుకొన్న దర్శకుడు పూరి, ఎన్ టీఆర్ లకి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.