‘రాజా ది గ్రేట్’ సెన్సార్ రిపోర్ట్.. బెంబేలెత్తుతున్న బాక్సాఫీస్

raja the great censor report
Tellmeboss.net

రెండేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ తన లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్’తో వస్తుండడంతో.. ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. పైగా.. ఓ గుడ్డివాడిగా నటిస్తున్నాడు కాబట్టి ప్రయోగాత్మక చిత్రాలు కోరుకునే ప్రేక్షకులు సైతం ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక రెండేళ్ల నుంచి రవితేజ సినిమాలు లేక అల్లాడిపోతున్న ఫ్యాన్స్ అయితే కసితో రగిలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు థియేటర్ల మీద దండయాత్ర చేద్దామా? అన్నట్లుగా వున్నారు. ఈసారి రవితేజ బ్లాక్‌బస్టర్ అందుకోవడం పక్కా అని వాళ్లు పూర్తి నమ్మకంతో వున్నారు.

Tellmeboss.net

దిల్‌రాజు సైతం ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. ఈ ఇయర్‌లో ఆల్రెడీ నాలుగు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అందుకున్న ఈ నిర్మాత.. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందని చెప్తూ వస్తున్నాడు. అతని మాట నూటికి నూరు శాతం నిజమే అవుతుందని సెన్సార్ బోర్డు సైతం సర్టిఫికెట్ ఇచ్చేసింది. రీసెంట్‌గా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. వాళ్లు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో బ్రహ్మాండమైన పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఏ అంచనాలైతే పెట్టుకున్నారో ఈ చిత్రం వాటిని పక్కా అందుకుంటుందని బల్లగుద్దిమరీ చెప్తున్నారు. ముఖ్యంగా.. రవితేజ అదరగొట్టేశాడని, ఒంటి చేత్తోనే బండి లాక్కొచ్చాడని, అతని పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ని అలరిస్తుందని పేర్కొంటున్నారు. గుడ్డివాడిగా అతను ప్రదర్శించిన నటనకు హ్యాట్సాఫ్ చెప్పేలా జీవించేశాడని కొనియాడుతున్నారు.

ఇక ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ, మాస్, ఫ్యామిలీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్ని పుష్కలంగా వున్నాయంటున్నారు. ‘పటాస్’, ‘సుప్రీం’ చిత్రాలతో ఫుల్ జోష్ మీదున్న అనిల్ రావిపూడి.. తన మూడో చిత్రాన్ని సైతం అద్భుతంగా తీర్చిదిద్దాడని, అతను హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. ఆల్రెడీ అన్ని ఏరియాల్లో నెలకొన్న పాజిటివ్ బజ్, ఇప్పుడు సెన్సార్ ఇచ్చిన పాజిటివ్ రిపోర్ట్‌ని బట్టి చూస్తే.. బాక్సాఫీస్‌పై రవితేజ మాస్ పంచ్ పడడం ఖాయం అన్నట్లు అనిపిస్తోంది. హీరోయిన్ మెహ్రీన్ సైతం చాలా బాగా నటించిందని, ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈనెల 18న రిలీజ్ అవుతోంది.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.