రజినీకాంత్, పా.రంజిత్‌ల ‘కాలా’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : కాలా
నటీనటులు : రజనీకాంత్‌, నానా పాటేకర్‌, సముద్రఖని, హుమా ఖురేషి, తదితరులు
రచన, దర్శకత్వం: పా. రంజిత్‌
నిర్మాత: ధనుష్‌
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
సినిమాటోగ్రఫీ: మురళి జి
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
బ్యానర్‌: వండర్‌ బార్స్‌ ఫిల్మ్స్‌
విడుదల తేదీ: 07-06-2018

‘కబాలి’ చిత్రంతో తీవ్రంగా నిరాశపరిచిన సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు ‘కాలా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత చిత్రాన్ని రూపొందించిన పా.రంజిత్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. మొదట్లో ఈ మూవీపై బాగానే అంచనాలు ఉండేవి కానీ.. రానురాను బజ్ తగ్గుతూ వచ్చింది. ప్రోమోలు ఆసక్తికరంగా లేకపోవడం, ‘కబాలి’ జంటనే మళ్ళీ ఈ మూవీ కోసం కలవడం.. ప్రేక్షకుల్లో పెద్దగా క్యూరియాసిటీ నెలకొల్పలేదు. అయితే.. రజినీకున్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీపై కాస్తోకూస్తో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ‘కాలా’ సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ :
ముంబైలోని ధారావి అనే మురికివాడకు కరికాలన్ (రజినీకాంత్) అకా ‘కాలా’ నాయకుడు. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అండగా ఉంటూ.. వారి కష్టాలను తీరుస్తుంటాడు. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడైన హరిదాదా (నానా పాటేకర్‌) తన అధికార బలంతో ఆ మురికివాడను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ.. అతని ప్రయత్నాలను ప్రతిసారీ కాలా అడ్డుకుంటుంటాడు. దీంతో.. కాలాని తన దారి నుంచి తప్పించాలని అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు హరిదాదా! మరి.. హరిదాదా కుట్ర ఫలించిందా? ‘కాలా’ అతని ప్రయత్నాలు ఎలా అడ్డుకుంటాడు? హరిదాదా చేతుల్లోకి ధారావి వెళ్లకుండా కాలా ఏం చేశాడు? అనే అంశాలతోనే ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
ఇదేం కొత్త స్టోరీ కాదు.. ‘నేల మా హక్కు’ అనే అరిగిపోయిన కాన్సెప్ట్ చుట్టూ నడిచే స్టోరీనే ఇది! భూమిని లాక్కోవడానికి ఓ రాజకీయ నాయకుడు కుట్రలు, కుతంత్రాలు చేస్తే.. హీరో వాటిని ఎలా అడ్డుకున్నాడనేదే కథ! ఇలాంటి స్టోరీలతో ఇప్పటికే కొన్ని వందల సినిమాలొచ్చాయి. ‘కబాలి’ని మాఫియా చుట్టూ కథని ఎలా అల్లుకున్నాడో.. ఇందులో ‘భూదందా’ చుట్టూ స్టోరీని రాసుకున్నాడు దర్శకుడు పా.రంజిత్! అయితే.. ఆ మూవీ కంటే బెటర్మెంట్ మాత్రం చూపించగలిగాడు. అలాగని మరీ గొప్పగా ప్రెజెంట్ చేయలేదు కానీ.. రజినీ మ్యానియాని బాగా ఉపయోగించుకుని కొద్దోగొప్పో మాయ చేయగలిగాడు.

స్టోరీ గురించి చెప్పుకుంటే.. ధారావి మురికివాడలో నివసించే ప్రజల కష్టాలు, ఆ మట్టిపై వాళ్లకున్న మమకారం, వాటికోసం జరిగే పోరాటం నేపథ్యాల్ని బాగా రాసుకోగలిగాడు దర్శకుడు. రీసెర్చ్ బాగానే చేశాడు. మొదట్లోనే ఒక ముఖ్యమైన సీన్‌తో మొదలుపెట్టి, ఆసక్తి రేకెత్తించాడు డైరెక్టర్. ఆ తర్వాత రజినీ మాస్ ఇంట్రొడక్షన్.. ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజంతో సినిమాని నడిపించాడు. రొమాంటిక్ సీన్స్ కూడా మురిపిస్తాయి. కాకపోతే.. కథనం స్లోగా సాగడం అసహనానికి గురి చేస్తుంది. కాలా- చిట్టెమ్మ(హుమా ఖురేషి)ల మధ్య నడిచిన లవ్‌ట్రాక్‌ సా…గదీయడంతో కాస్త భారంగా అనిపిస్తుంది. కాకపోతే రజినీ ఫ్యాన్స్‌కి మాత్రం అది నచ్చుతుంది. ఇంటర్వెల్ సీన్ వద్ద రజినీ-నానాల మధ్య వచ్చే సీన్ మాత్రం హైలైట్. అది ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రజినీ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఆ సీన్ పీక్స్! గూస్‌బంప్స్ రావడం పక్కా!

అయితే.. సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కథ వేగం బాగా తగ్గింది. ధారావి చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఎమోషన్స్ పండించే ఆస్కారం ఉన్నప్పటికీ.. దర్శకుడు పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. రజినీ హీరోయిజాన్ని కూడా పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాడు. ప్రేక్షకులు కోరుకునే బలమైన అంశాలు పెద్దగా పడలేదు. రొటీన్ స్టోరీ కావడంతో తర్వాత ఏం జరుగుతుందనేది ముందుగానే ఊహించేసుకోవచ్చు. పోరాట సన్నివేశాల్ని మాత్రం బాగానే హ్యాండిల్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే.. కథ, కథనాలు బలంగా లేకపోవడం ఈ మూవీకి మేజర్ మైనస్! దాదాపు ఈ చిత్రాన్ని కూడా ‘కబాలి’లాగే సింగిల్ హ్యాండ్‌తో రజినీకాంత్ నెట్టుకొచ్చేశాడని చెప్పుకోవచ్చు.

నటీనటుల ప్రతిభ :
రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది.. ఈ వయసులోనూ ఆయన తన స్టైల్, చార్మ్‌తో అద్భుతంగా తన ప్రతిభ చాటిచెప్పగలరు. రొమాంటిక్, డైలాగ్ డెలివరీ, యాక్షన్స్, ఎమోషన్స్.. ఇలా అన్నింటిలోనూ తనదైన మార్క్ చూపిస్తారు. కాకపోతే.. రంజిత్ ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదన భావన మాత్రం తప్పకుండా కలుగుతుంది. చాలాసేపటి వరకూ ఆయన్ను సరిగ్గా ఎలివేట్ చేయలేదు. అయితే.. కథ నడుస్తున్న కొద్దీ, ఆయన పాత్రను కొంచెం కొంచెం పెంచుకుంటూపోయాడు. అక్కడే రజినీ తన చార్మ్‌తో కుమ్మేశారు. రజనీ తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర నానాపాటేకర్‌ది. విలక్షణ నటుడిగా పేరున్న ఆయన.. తన పాత్రను నూటికినూరుపాళ్ళు న్యాయం చేశారు. నానా పాటేకర్‌ కనిపించినప్పుడల్లా తెరపై ఓ గాంభీర్యం కనిపిస్తుంది. ఇక ఈశ్వరీరావు, హుమా ఖురేషి, సముద్రఖని వీరంతా తమ పాత్ర పరిధి మేరకు రాణించారు.

టెక్నికల్ పెర్పార్మెన్స్ :
మురళి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మురికివాడ సీన్లను తన కెమెరాలో బంధించిన తీరు అద్భుతం! కళా దర్శకుడు కూడా మురికివాడ సెట్‌ని ఆశ్చర్యకరంగా రూపొందించాడు. సెట్ అని తెలియకుండా నిజమైన మురికివాడలో మాయ చేసి అదరహో అనిపించాడు. సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణ్‌ మరోసారి ‘కబాలి’ థీమ్‌ను ఫాలో అయిపోయాడు. పాటలు, నేపథ్య సంగీతాల్లో దాదాపు ఆ మూవీ ఛాయలు కనిపిస్తాయి. పా.రంజిత్ ‘కబాలి’ రేంజ్‌లో కాకపోయినా.. ఒకింత ఫర్వాలేదనిపించాడు. కాకపోతే అంచనాల్ని సరిగ్గా రీచ్ అవ్వలేకపోయాడు. రజినీకి తగ్గట్టు కథ, కథనాన్ని రాసుకోలేక.. కాస్త చేదు అనుభవాన్నే మిగిల్చాడు.

చివరగా : ‘కాలా’.. మరో కబాలి!
రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.