మెగాహీరోతో రకుల్ డేటింగ్..? కానీ ఇక్కడో ఫిట్టింగ్!

హీరో-హీరోయిన్లు కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే.. ఆ ఇద్దరి మధ్య ఏదో లవ్వాట నడుస్తోందనే పుకార్లు రావడం సహజం! అయితే.. చాలాకాలం దూరంగా ఉన్నా, ఏ పార్టీలో పెద్దగా కలుసుకోకపోయినా, అలాంటి వార్తలే వస్తే మాత్రం.. కాస్తోకూస్తో నిజమై ఉంటుంది. పబ్లిక్‌గా తెలియకపోయినా.. సీక్రెట్‌గా మాత్రం ఆ తంతు నడుస్తుంటుంది. ఇదివరకు కూడా కొన్ని జంటలు ఇలా రహస్యంగా తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు కాబట్టి.. ఇప్పుడు తాజాగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త కూడా నిజమని నమ్మకతప్పని పరిస్థితి.

అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోయిన రకుల్ ప్రీత్.. ఓ మెగాహీరోతో పీకల్లోతు లవ్‌లో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ఒక పుకారు హల్‌చల్ చేస్తోంది. అదికూడా ఆ ఇద్దరూ ఏకంగా రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నారని, కెమెరా కంటికి చిక్కకుండా తరచూ కలుసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ మెగాహీరో ఎవరనుకుంటున్నారు? మరెవ్వరో కాదు.. సాయి ధరమ్ తేజ్. ‘విన్నర్’ మూవీలో కలిసి నటించినప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటినుంచి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే.. ఇక్కడో చిన్న ఫిట్టింగ్ కూడా ఉందట. పెళ్ళిగట్రాలేమీ చేసుకోకుండా.. కేవలం డేటింగ్ మాత్రమే చేసుకోవాలని ఆ ఇద్దరు నిర్ణయించుకున్నారట.

నిజానికి.. గతంలోనూ రకుల్, తేజు ప్రేమించుకుంటున్నారని పుకార్లు వచ్చినప్పుడు వాటిని ఆ ఇద్దరూ ఖండించారు. తాము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అలాంటిది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఎఫైర్ వార్తలు రావడాన్ని బట్టి చూస్తుంటే.. నిజమేనని అనిపిస్తోంది. మరి.. దీనిపై ఆ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.