ఆ హీరోతో నా కోరిక తీర్చుకుంటా – రకుల్

బాలీవుడ్ నుండి టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇక్కడే సక్సెస్ అందుకున్న చిన్నది రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తెలుగు జనాల మతి పోగొడుతూ వచ్చిన ఈ భామ ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగులో మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే అమ్మడికి ప్రస్తుతం బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. తీసిన ప్రతీ సినిమా కూడా నిరాశను మిగిలిస్తుండటంతో తన నెక్ట్స్ మూవీలను చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటోంది.

ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నా కూడా ఓ మిడిల్ రేంజ్ హీరోతో సినిమాకు ఓకే చెప్పేసింది. వరుసగా సక్సెస్ సినిమాలను చేస్తూ టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న నేచురల్ స్టార్ నాని నటించబోయే చిత్రంలో హీరోయిన్‌గా చేసేందుకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ సినిమాలో నాని ఒక్కడే హీరో కాదండోయ్. కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో ఇదో పెద్ద మల్టీస్టారర్‌గా మారింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్‌ది చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

ఇక నానితో సినిమా చేయడం అంటే సక్సెస్‌ను దక్కించుకోవడమే అనే రేంజ్‌లో మనోడు హిట్స్ కొడుతుండటంతో రకుల్ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. మరి రకుల్ కోరికను నాని తీరుస్తాడో లేదో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.