చరణ్‌కి కథ నావల్ల కాదు.. బాలయ్యే బెటర్ బ్లైండ్‌గా..!

Tellmeboss.net

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలుసు. మొన్నీమధ్యే ప్రారంభోత్సవం జరుపుకుని, ఒక ముహూర్తం షాట్‌ని కూడా బయటపెట్టింది చిత్రబృందం! ఈ ఏడాది జనవరిలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది కూడా!

కానీ.. ఆల్రెడీ సగం నెల గడిచిపోయిన ఇంతవరకు ఆ మూవీ ప్రస్తావన ఎక్కడా రాలేదు. బోయపాటిగానీ, చరణ్‌గానీ, నిర్మాతలుగానీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మొన్నామధ్య ‘జై సింహా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను బాలయ్యతో తదుపరి సినిమా చేస్తున్నానని బోయపాటి చెప్పాడు తప్పితే.. రామ్ చరణ్ ప్రాజెక్ట్ గురించి పల్లెత్తి మాట కూడా చెప్పలేదు. మరి.. ఆ మూవీ సంగతి ఏమైందని ఆరాతీయగా, అసలు సీక్రెట్ బయటపడింది. ఈ సినిమాని షూటింగ్‌ని ఆపేశారని సమాచారం. చరణ్‌కి కథ నచ్చకపోవడం వల్లే చిత్రాన్ని అర్థంతరంగా ఆపేసినట్లు తెలుస్తోంది.

Tellmeboss.net

నిజానికి.. బోయపాటి తీసే సినిమాలు రిలీజైన ప్రతిసారి వాటి కథలు పరమ రొటీన్ అని విమర్శలు వచ్చాయి. రీసెంట్‌గా విడుదలైన ‘జయ జానకి నాయక’ మూవీ విషయంలో అలాంటి విమర్శలు మరిన్ని ఎక్కువయ్యాయి. ఇక చరణ్‌కి బోయపాటి చెప్పిన కథ కూడా రొటీన్ కావడంతో.. అందులో మార్పులు చేయమని చెర్రీ సూచించాడట. అప్పటినుంచి ఎన్నిసార్లు మార్పులు చేసినా.. చరణ్‌కి ఆ స్ర్కిప్ట్ పెద్దగా నచ్చట్లేదట. బోయపాటికి కూడా స్ర్కిప్ట్‌లో మార్పులు చేసిచేసి విసిగెత్తిపోవడంతో.. ఆ ప్రాజెక్ట్‌నే పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది.

ఓవరాల్‌గా కథనే పూర్తిగా మార్చేసి.. ఆ తర్వాతే చరణ్‌తో మూవీ చేయాలని బోయపాటి ఫిక్స్ అయినట్లు సమాచారం. చరణ్‌ కన్విన్స్ అయ్యేలా కథని రెడీ చేసేలోపు.. బాలయ్యతో బ్లైండ్‌గా మూడ చేయడమే బెటరని ఈ ఊరమాస్ దర్శకుడు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్యతో మూవీ చేశాకే చరణ్‌తో సెట్స్ మీదకి వెళ్లేలా ప్లాన్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.