మెగా ఫ్యాన్స్‌కు షాక్.. గుట్టు చప్పుడు కాకుండా చరణ్ సినిమా రిలీజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్ పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌తో అలరించడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. కాగా అందరికీ షాకిస్తూ తమిళంలో చరణ్ సినిమా ఈ వారంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.

రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చిరుత’. దర్శకుడు పూరీ జగన్నాధ్ టేకింగ్, రామ్ చరణ్ యాక్టింగ్‌ కలిసి ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌గా నిలిపాయి. ఇక రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవడమే కాకుండా మెగాస్టార్ అసలైన వారసుడిగా గుర్తింపు తెచ్చాయి. ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం తమిళ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో చిరుతై వెట్టై సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ చిత్రాన్ని పీకే స్టూడియో బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఇలా అనుకోకుండా రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ సినిమాను మరి తమిళ తంబీలు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.