ఆ విషయంలో సతమతమవుతున్న చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు బాధ్యతలు తన బుజంపై వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఒక పక్క భారీ సినిమాల్లో హీరోగా నటిస్తుండగా మరోపక్క అంత‌కుమించిన భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అతను బోయపాటి డైరెక్షన్‌లో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటు తన తండ్రి చిరంజీవి హీరోగా దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో చరణ్‌పై తీవ్రమైన ఒత్తిడి నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ చరణ్‌కు ఎంతో కీలకమైనవి. ఈ రెండింటి విజ‌యం చాలా ముఖ్యం. ఆ క్రమంలోనే రిలీజ్ తేదీలు ఒకేసారి ఉండటంతో ఊహించ‌ని రీతిలో చ‌ర‌ణ్‌పై ఒత్తిడి పెరుగుతోందట‌. ఇప్పటివరకు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్‌పై చరణ్‌కు ఇంకా క్లారిటీ లేదు. మొదట ‘సైరా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాకే తర్వాత తన సినిమా గురించి ఆలోచించమని డి.వి.వి.దాన‌య్యను చ‌ర‌ణ్ రిక్వెస్ట్ చేశాడు.

‘సైరా’ సంక్రాంతికి వస్తే చరణ్ తన సినిమాను సంక్రాంతి తర్వాత రిలీజ్ చేసుకుంటాడు. అదే ‘సైరా’ సమ్మర్‌కి వెళ్తే బోయపాటి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న చ‌ర‌ణ్‌ చేశార‌ట‌. అవి ఏవి కుదరకపోతే బోయపాటి – చరణ్ సినిమా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లోనే రిలీజ్ చేస్తాం అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా నిర్మాత‌లు ప్రక‌టించాల్సి ఉంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.