కమెడియన్‌ని కొట్టించిన చరణ్.. వీడియో లీక్!

రామ్ చరణ్‌కి ఉన్నట్లుండి ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ.. స్వయంగా తాను దగ్గరుండి ఒక కమెడియన్‌ని కట్లతో కొట్టించాడు. అవును.. మీరు
చదువుతోంది అక్షరాల నిజం. ఏ చరణ్ అయితే సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడో.. ఆ మెగాహీరోనే ఒక ఆర్టిస్ట్‌ని చితక్కొట్టించాడు. అతడ్ని
కొడుతుంటే.. చరణ్ పక్కనే నవ్వుతూ ఆనందం పొందుతున్నాడు. కానీ.. ఈ మొత్తం వ్యవహారం సీరియస్‌గా నడవలేదులెండి.. సెట్స్‌లో సరదాగా
నడిచిన తంతంగం!

చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ లేని టైంలో సెట్స్‌లోనే చరణ్ తన తోటి
ఆర్టిస్టులతో సరదాగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక వీడియో లీక్ అయ్యింది. అందులో జబర్దస్త్ కమెడియన్‌ గెటప్ శ్రీనివాస్‌తో ఒక
ఆర్టిస్టుని కట్టెతో కొట్టిస్తూ చరణ్ కనిపించాడు. దాంతో.. చుట్టుపక్కనున్న వాళ్లంతా నవ్వుతూ కనిపించారు. ఎంతో సరదాగా ఉన్న ఈ వీడియో
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా.. మెగాఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కి చాలా
టైం ఉండడంతో.. ఇప్పట్లో ఇలా వీడియోలు, ఫోటోలు చూస్తూ సంతృప్తి చెందుతున్నారు.

ఇకపోతే.. చరణ్ ఇందులో చెవిటోడిగా నటిస్తుండగా, అతని మరదలిగా సమంత కనిపించనుంది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ ప్రత్యేక
పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.