వర్మ పేల్చిన వోడ్కా తూట్లు.. పవన్‌పై హాలీవుడ్ పంచ్‌లు

రాంగోపాల్ వర్మ ఎప్పుడెలా ఉంటాడో ఎవ్వరికీ అర్థం కాదు. సందర్భోచితమైన వ్యాఖ్యలతో జనాల్ని కన్ఫ్యూజ్ చేసిపడేస్తుంటాడు. ఇన్నాళ్లూ తన పనిలో తాను బిజీగా ఉండడం వల్ల ఎవ్వరినీ కెలకలేదు. ఇప్పుడు ఖాళీ సమయం దొరకడంతో.. పవన్ ఫ్యాన్స్‌ని కెలికేశాడు. కత్తి మహేష్‌తో ఇక తెగిపోయిందిలే అని కాసింత ఊపిరి పీల్చుకునేలోపే.. లేటెస్ట్‌గా వర్మ రూపంలో మళ్ళీ ఫ్యాన్స్‌కి తలనొప్పి మొదలైపోయింది. మళ్ళీ వోడ్కా వేసి.. తన పిట్టతో కూతలు వేయించాడు. డిజాస్టర్ అయిన ‘అజ్ఞాతవాసి’ని టార్గెట్ చేస్తూ.. పవన్‌ని ఘోరంగా ఎగతాళి చేసిపడేశాడు.

‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్‌కి త్రివిక్రమ్‌ని నిందించడం ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే.. ఆకాశమంత ఇమేజ్ వున్న పవన్ కళ్యాణ్ మీద దుప్పటి కప్పడం హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు, జురాసిక్ పార్క్ వంటి క్లాసిక్స్ తీసిన స్టీవెన్ స్పిల్బర్గ్, అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరున్ వల్ల కూడా కాద’’ అని వర్మ పంచ్ వేశాడు. ఇక్కడితో ఆగలేదండోయ్.. ఇంతకుమించి పవన్‌పై కౌంటర్ వేస్తూ మరో ట్వీట్ చేశాడు. ‘‘అమ్మ తోడు.. పైన చెప్పిన ఇద్దరితోపాటు క్రిస్టోఫర్ నోలన్, స్వర్గీయ అల్ఫ్రెడ్ హిచ్ కాక్ కలిసి.. ఫ్రాన్సిస్, కొప్పల అకిరా కురసోవాలను అసిస్టెంట్ డైరెక్టర్లుగా పెట్టుకుని సినిమా తీసినా పవర్ ఇమేజ్‌కి న్యాయం చేరలేరు. అలాంటప్పుడు త్రివిక్రమ్ ఎంత? కాబట్టి అతడ్ని నిందించడం కరెక్ట్ కాదు’’ అని ట్వీటాడు.

ఈ ట్వీట్లలో పవన్ కళ్యాణ్‌పై పొగడ్తలు కురిపించాడో లేక కౌంటర్లు వేశాడో సరిగ్గా అర్థం కాకపోయినప్పటికీ.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకులు సైతం పవన్‌ను డీల్ చేయలేరు అని చెప్పడం వ్యంగ్యంగా ఉంది. ఒకరకంగా చూస్తే.. పవన్‌గా దారుణంగా ఎగతాళి చేశాడని స్పష్టం అవుతోంది. మరి.. దీనిపై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో?

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.