అజ్ఞాతవాసికి వర్మ ‘కత్తి’పోట్లు.. ఇది దారుణమైన అవమానం

Tellmeboss.net

ఆల్రెడీ విమర్శలపాలైన సెలబ్రిటీల్నిగానీ, రాజకీయ నాయకుల్నిగానీ ఓ ఆటాడుకోవడం రాంగోపాల్ వర్మకి వెన్నతో పెట్టిన విద్య. అందులో ఆయనకో బ్లడీ శాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి టైం చూసుకుని సెటైర్లు వేస్తుంటాడు ఈ ఘనుడు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఫ్లాప్ కావడంతో దానిపై ‘పంజా’ విసిరాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి సీన్‌లోకి కత్తి మహేష్‌ని కూడా లాగాడు. పవన్‌ని కత్తి తన సంచలన వ్యాఖ్యలతో నరుకుతున్నాడు కాబట్టి.. ‘అజ్ఞాతవాసి’ని అవమానపరుస్తూ అతడ్ని ప్రశంసలతో ఆకాశానికెత్తేశాడు.

‘‘నేనెప్పుడూ పళ్లు లేని, పంజా విసరలేని ‘పులి’ని చూడలేదు. అంతేకాదు.. ఈ పులి ప్రతిసారి తన చారలు మార్చడాన్ని చూసి నేను స్టన్ అయిపోయా. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పులి జంప్ చేయడానికి బదులు పాకుతోంది’’ అంటూ ‘అజ్ఞాతవాసి’ని దారుణంగా అవమానించాడు వర్మ. ఆ వెంటనే ‘అజ్ఞాతవాసి’పై సుదీర్ఘ రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్ వీడియో లింక్‌ని షేర్ చేస్తూ.. ‘‘ఇందులో పవన్ కంటే కత్తి మహేష్ ఎంతో హ్యాండ్‌సమ్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాడు’’ అంటూ మరో బాంబ్ పేల్చాడు. సరైన టైమింగ్‌ని ఎలా వాడుకువాలో వర్మకంటే బాగా మరెవ్వరికీ తెలీదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి తాజాగా చేసిన ట్వీట్లే నిదర్శనం.

Tellmeboss.net

అదంతా ఓకే గానీ.. ఇప్పటికే సినిమా ఫ్లాప్ అయ్యిందని తీవ్ర మనోవేదనకు గురవుతున్న పవన్ ఫ్యాన్స్‌కి వర్మ ట్వీట్ మరింత బాధ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అటు కత్తి కూడా వరుస పోట్లతో తెగ నరికేస్తాడు. దీంతో.. తమ ఆ ఆవేదనని కోపం రూపంలో ఈ ఇద్దరి మీద చూపిస్తున్నారు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.