పసివాడికి డబ్బింగ్ చెప్పిన వర్మ

ram gopal varma reaction on pawan kalyan son photo

ఏదైనా ఒక సందర్భం వస్తే చాలు.. దానిపై వర్మ చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఇతరుల ఫీలింగ్స్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన భావాల్ని నిర్మొహమాటంగా ఈ సంచలన దర్శకుడు సోషల్ మీడియా మాధ్యమంగా వెల్లడించేస్తాడు. అవతలివారు ఎంత పెద్ద స్టేటస్‌లో వున్నా సరే.. ఏమాత్రం బిడియం లేకుండా పంచ్‌లు, సెటైర్లు వేసేస్తాడు. అలాంటి ఆయన తొలిసారి ఒక క్యూట్ కామెంట్ చేశారు. ఇది పవన్ ఫ్యాన్స్‌నే కాకుండా జనాల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రీసెంట్‌గానే పవన్ నాలుగోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన భార్య అన్నా లెజినోవా పండంటి మగబిడ్డకి జన్మనివ్వగా.. అప్పుడే పుట్టిన తన పసికందును ఎత్తుకుని పవన్ ఫోటో దిగారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ మరో పవర్‌స్టార్ పుట్టాడని మురిసిపోతుంటే.. వర్మ మాత్రం తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ‘పవన్ కళ్యాణ్ ఊహించలేనంత క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ పవన్ చేతిలోని పసివాడికి డబ్బింగ్ ఇచ్చినట్లుగా స్వీట్ పోస్ట్ పెట్టాడు.

వర్మ నుంచి ఇలాంటి కామెంట్ ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే.. ఆయన ప్రతి సిట్యుయేషన్‌పైనా సెటైరిక్‌గానే రియాక్ట్ అవుతాడు. అలాంటిది.. పవన్ ఫోటోపై క్యూట్ కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Related posts:
కాంగ్రెస్‌కు కేసీఆర్ షాక్‌: గులాబి గూట్లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌
మ‌హేష్ ఇంట్లో దీపావ‌ళి గిఫ్ట్‌!!
టీవీ యాంకర్ సీక్రెట్ వీడియో... సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. ఆందోళనలో ఫ్యాన్స్!!
శ్రీరెడ్డి లీక్స్: ‘బూతు’ ఫోటోలతో రానా తమ్ముడి గుట్టు రట్టు
కళ్యాణి లీక్స్ : శ్రీరెడ్డి బండారం బట్టబయలు

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.