వర్మ ట్వీట్‌కి శాస్త్రి ‘పవర్‌ఫుల్’ వార్నింగ్.. దెబ్బ అదుర్స్!

పుండుమీద కారం చల్లే అలవాటు రాంగోపాల్మ వర్మకి ఎప్పట్నుంచో వుంది. కాకపోతే.. ఇంతకుముందు అతడ్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ.. ఇప్పుడు హద్దులు దాటుతుండడంతో రివర్స్ కౌంటర్లు విపరీతంగా పడుతున్నాయి. ఫ్యాన్స్ నుంచే కాదు.. సెలబ్రిటీల నుంచి కూడా మనోడికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అయితే ఏకంగా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు.

మేటర్‌లోకి వెళ్తే.. శ్రీరెడ్డి ఇష్యూలో తలదూర్చి ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి ఇప్పటికే ఎంతో అప్రతిష్ట మూటగట్టుకున్నాడు వర్మ! ఇది తన ఇమేజ్‌కే కాకుండా ‘ఆఫీసర్’ రిలీజ్‌కి గండికొట్టే ఛాన్స్ వుందని భావించి.. క్షమాపణలు కోరాడు. అంతేకాకుండా తన తల్లిపై ఒట్టు వేస్తూ.. మళ్ళీ ఎప్పుడూ పవన్ జోలికి వెళ్ళనని ప్రామిస్ చేశాడు. దీంతో.. ఫ్యాన్స్ ఒకింత కూల్ అయ్యారు. బహుశా దీన్ని వర్మ అలుసుగా తీసుకున్నట్టున్నాడు.. అందుకే మళ్ళీ రెచ్చిపోయాడు. పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వివాదాలకు తెరలేపుతున్నాడు. ఇక్కడివరకూ ఓకే గానీ.. పవన్ తలపెట్టిన మంచి కార్యాన్ని కూడా వర్మ అపహాస్యం చేశాడు.

ఆదివారం కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న పవన్.. మెట్ల మార్గంలో వెళ్లేటప్పుడు అలసటతో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దానిపై వర్మ వివాదాస్పద ట్వీట్ పెట్టాడు. ‘పవన్ పవర్‌ఫుల్ ఎనర్జీకి ఈ ఫోటోనే నిదర్శనం’ అన్నాడు. అంటే.. ఎనర్జీ ఏమాత్రం లేని పవర్‌లెస్ స్టార్ అనేది అతని అభిప్రాయం! దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్.. వర్మని ఓ రేంజులో తలుగుకున్నారు. చివరికి సెలబ్రిటీలు కూడా వర్మకి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. అందులో.. రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ ఫ్యాన్స్‌ని ఆకర్షించింది.

‘‘కెలకమాకు సామీ.. కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరు.. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడుకోండి’’ అంటూ శాస్త్రి పవర్‌ఫుల్ కౌంటర్ ఇచ్చాడు. అంటే.. మీకూమీకూ ఏమైనా వుంటే పర్సనల్‌గా మాట్లాడుకోండే తప్ప.. ఇలా ట్వీట్లు పెట్టి అనవసరంగా ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టకండి.. ఇది మీ ఇమేజ్‌కే కరెక్ట్ కాదంటూ శాస్త్రి వార్నింగ్ ఇచ్చారన్నమాట!

Related posts:
తెలంగాణ టీడీపీకి ఊహించని షాకిచ్చిన పవన్‌కళ్యాణ్?
పట్టపగలే మహిళను కాల్చి చంపిన ఎస్సై.. ఆపై ఆత్మహత్య!
‘లీడర్‌’తో కలిసి స్టెప్పులేసిన మెగా ‘గ్యాంగ్’ (వీడియో)
ఇదో విచిత్రమైన ఉద్యోగం.. పోర్న్ సినిమాలు చూస్తే రూ.2 లక్షల జీతం!!
అడిగినంత ఇవ్వండి.. కావాల్సినంతా దోచుకోండి : సనాఖాన్
అర్జున్ రెడ్డికి కాపీ తిప్పలు.. వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.