ఆ గ్యాంగ్‌‌కి తోపు నేనే అంటున్న బ్యూటీ!

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమా కోసం సూర్య స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. అంత ఇంపార్టెన్స్ సాధించుకున్న గ్యాంగ్ సినిమాకు నేనే తోపు అంటోంది ఓ బ్యూటీ. ఈ సినిమాలో తన పాత్రే కీలకం అంటూ గ్యాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసుకుందామా.

బాహుబలి వంటి హిస్టారికల్ ఎపిక్‌లో ‘శివగామి’గా నటించి యావత్ ప్రేక్షకులచేత నీరాజనాలు పట్టించుకున్న నటి రమ్యకృష్ణ సూర్యతో కలిసి గ్యాంగ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో సూర్య అండ్ గ్యాంగ్ చేసే రచ్చ మామూలుగా ఉండదట. వారు ఈ సినిమాలో దొంగలుగా చేసే యాక్షన్ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చుతుందని రమ్యకృష్ణ చెబుతోంది. ఇక తన పాత్రకు ఈ సినిమాలో మంచి గుర్తింపు లభిస్తుందని ఆమె నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించినప్పటికీ తన పాత్రకే జనాలు విజిల్స్ వేస్తారని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది రమ్యకృష్ణ.

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన గ్యాంగ్ సినిమాను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా సూర్య తన సొంత బ్యానరయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండటం విశేషం.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.