రంగస్థలం 13 డేస్ కలెక్షన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చని ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర్నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా తొలిరోజు నుండే అదిరిపోయే కలెక్షన్లు రాబడుతుంది.

చరణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు జనాలు ఫిదా కావడంతో ఈ సినిమా స్టన్నింగ్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా 13 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 72.20 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా ఇంకా ఎంతమేర కలెక్ట్ చేస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం రూ. 100 కోట్ల షేర్‌ వసూళ్లకు చాలా దగ్గరగా ఉంది. చరణ్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్‌లు కలిసి రంగస్థలం చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేశారు.

ఏరియా వారీగా రంగస్థలం రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 13 డేస్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 21.35 కోట్లు
సీడెడ్ – 13.90 కోట్లు
నెల్లూరు – 2.65 కోట్లు
కృష్ణా – 5.74 కోట్లు
గుంటూరు – 7.04 కోట్లు
వైజాగ్ – 10.35 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6.25 కోట్లు
వెస్ట్ గోదావరి – 4.92 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 72.20 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.