రంగస్థలం 15 రోజుల కలెక్షన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగస్థలం’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో రంగస్థలంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసారు మెగా ఫ్యాన్స్.

వారి అంచనాలను ఏమాత్రం వమ్ము చేయకుండా రంగస్థలం చిత్రం ఉండటంతో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఫ్యాన్స్. బాక్సాఫీస్‌ను దడదడలాడించే కలెక్షన్స్‌తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా 15 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.74.28 కోట్లు సాధించింది. ఈ సినిమాతో చరణ్ అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాగా తాజాగా ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌లో చరణ్ యాక్టింగ్‌ను ఆకాశానికెత్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర 15 రోజుల కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా – 15 రోజుల కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 21.99 కోట్లు
సీడెడ్ – 14.30 కోట్లు
నెల్లూరు – 2.73 కోట్లు
కృష్ణా – 5.87 కోట్లు
గుంటూరు – 7.18 కోట్లు
వైజాగ్ – 10.71 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6.41 కోట్లు
వెస్ట్ గోదావరి – 5.09 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 74.28 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.