రంగస్థలం 17 రోజుల కలెక్షన్స్.. ఏందయ్యా సామీ ఇది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ మూడోవారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా సాలిడ్ సౌండ్ చేస్తూ దూసుకుపోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ రివెంజ్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేయటంతో ఈ సినిమా చూసేందుకు వారు థియేటర్స్‌కు బారులు తీరారు.

దీంతో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులకు తెరలేపింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల షేర్ కలెక్షన్స్‌ కొల్లగొట్టి బాక్సాఫీస్‌ను దడదడలాడించింది. తాజాగా ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘‘ఖైదీ నెంబర్ 150’’ రికార్డును సైతం అధిగమించింది. కాగా ఈ చిత్రం 17 రోజులకుగాను రూ. 106.43 కోట్ల వరల్డ్‌వైడ్ షేర్ సాధించింది. చరణ్ పవర్‌ప్యాక్ పర్ఫార్మెన్స్‌కు జనాలు ఫిదా అయ్యారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అదనపు బలంగా మారింది. ఈ చిత్ర 17 రోజుల కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 17 రోజుల కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 23.40
సీడెడ్ – 15.20
నెల్లూరు – 2.91
కృష్ణా – 6.20
గుంటూరు – 7.51
వైజాగ్ – 11.21
ఈస్ట్ గోదావరి – 6.69
వెస్ట్ గోదావరి – 5.31
టోటల్ ఏపీ+తెలంగాణ – 78.43 కోట్లు
కర్ణాటక – 8.40 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.70 కోట్లు
ఓవర్సీస్ – 16.90
టోటల్ వరల్డ్‌వైడ్ – 106.43 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.