చరణ్ వల్ల ‘రంగస్థలం’కి 20 కోట్లు బొక్క.. కానీ!

సాధారణంగానే స్టార్ హీరోల సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అదే మూవీకి ట్యాలెంటెడ్ డైరెక్టర్, డిఫరెంట్ కాన్సెప్ట్, అదిరిపోయే క్యాస్ట్ తోడైతే.. ఇక ఆ అంచనాల్ని అందుకోవడం సాధ్యం కాదు. కనివినీ ఎరుగని స్థాయిలో భారీ క్రేజ్ నెలకొంటుంది. అదిచూసి డిస్ట్రిబ్యూటర్లు గుడ్డిగా భారీ రేట్లకు హక్కుల్ని సొంతం చేసుకుంటారు. హీరోల మార్కెట్ వ్యాల్యూకంటే అత్యధిక అమౌంట్ ముట్టజెప్పడానికి ముందుకొస్తారు. ‘రంగస్థలం’ సినిమా విషయంలో సేమ్ ఇదే జరిగింది.

రామ్‌చరణ్‌కి సుకుమార్‌లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తోడు కావడం.. తెలుగులో ఎప్పుడూ రాని కాన్సెప్ట్‌తో ‘రంగస్థలం’ తెరకెక్కుతుండడం.. క్యాస్టింగ్ కూడా అదిరిపోవడంతో ఈ మూవీపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. దీంతో బయ్యర్లు హక్కుల కోసం ఎగబడ్డారు. రేటు ఎక్కువైనా వెనక్కు తగ్గేది లేదంటూ పోటీపడ్డారు. క్యాష్ చేసుకోవడానికి ఇదే అదునుగా భావించి నిర్మాతలు భారీగా కోట్ చేశారు. ఈ కొటేషన్ లెక్కల్ని అంచనా వేస్తే.. రూ.100 కోట్ల మార్క్ దాటింది కూడా! కానీ.. ఇక్కడే చరణ్ ఏ హీరో చేయని పని ఒకటి చేశాడు. డిస్ట్రిబ్యూటర్ల సేఫ్టీ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

అనవసరంగా ఎక్కువ రేట్లకు రైట్లు అమ్మొద్దని.. రికవర్ చేయగలిగేంత స్థాయికే హక్కుల్ని విక్రయించమని నిర్మాతలకు సూచించాడు. ఇది సరైనదేనని భావించిన నిర్మాతలు.. అతని సూచన మేరకు కాస్త వెనక్కు తగ్గారు. దీంతో.. రూ.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈరోజుల్లో పెద్ద సినిమాలు పెట్టుబడిని రికవర్ చేయలేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. అందుకే.. చరణ్ వల్ల నిర్మాతలకు రూ.20 కోట్లు తగ్గినా.. అతని సూచన కరెక్ట్ అంటూ విశ్లేషకులు కితాబిస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.