‘రంగస్థలం’ 45 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. చరిత్ర తిరగరాసిన చరణ్

ఈరోజుల్లో ఒక సినిమా ‘లైఫ్’ రెండు నుంచి మూడు వారాలకంటే ఎక్కువగా ఉండదన్నది జగమెరిగిన సత్యం! ఒకవేళ బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే.. మహా అయితే ఇంకో వారం ఎక్స్‌ట్రా నడుస్తుందంతే! ఆ తర్వాత పదో పరకో థియేటర్లలో తప్ప.. మరెక్కడా దాని జాడ కనిపించదు. అంటే.. ఇక ఆ సినిమా పని అయిపోయినట్లే లెక్క!

అయితే.. ‘రంగస్థలం’ మాత్రం ఈ లెక్కల్ని తారుమారు చేసిపారేసింది. ఏడో వారంలోనూ ట్రేడ్ వర్గాలు హడలెత్తిపోయేలా ఈ చిత్రం డీసెంట్ పరుగు కొనసాగిస్తోంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. చాలా గ్యాప్‌తో రిలీజైన ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య’ సినిమాల కంటే ‘రంగస్థలం’ మూవీనే మరింత ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా.. వీకెండ్స్‌లో ఆ రెండు చిత్రాల్ని పూర్తిగా డామినేట్ చేస్తూ.. తన తడాఖా ఏంటో చాటిచెప్తోంది.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. బాక్సాఫీస్ వద్ద 45 రోజులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ‘రంగస్థలం’ ప్రపంచవ్యాప్తంగా రూ.124.45 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కొల్లగొట్టింది. ఇది ‘నాన్ – బాహుబలి’ రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చరణ్ నటన, సుకుమార్ టేకింగ్.. ఈ రెండూ అంచనాలకు మించి ఉండటంతో.. జనాలు ఫిదా అయి ఇప్పటికీ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.

ఏరియాలవారీగా 45 రోజుల కలెక్షన్స్ : (కోట్లలో)
నైజాం : 28.30
సీడెడ్ : 18.05
ఉత్తరాంధ్ర : 13.17
వెస్ట్ గోదావరి : 6.23
ఈస్ట్ గోదావరి : 8.03
గుంటూరు : 8.4
కృష్ణా : 6.95
నెల్లూరు : 3.47
ఏపీ+తెలంగాణ షేర్ : రూ.92.6 కోట్లు
కర్ణాటక : 9.10
తమిళనాడు : 1.20
యూఎస్ఏ : 14.20
ఆస్ట్రేలియా/న్యూజిల్యాండ్ : 0.95
యూఏఈ+జీసీసీ : 1.55
రెస్ట్ : 2.85
ఓవర్‌ఫ్లోస్ : 2.00
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ.124.45 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.