66వ రోజు అక్కడ చరిత్ర సృష్టించిన ‘రంగస్థలం’

ఈరోజుల్లో సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు! ఎంత భారీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే.. మహా అయితే నాలుగోవారం వరకూ తమ తడాఖా చూపిస్తాయి. ఆ గ్యాప్‌లోపు బాక్సాఫీస్ వద్ద విజృంభించి.. గత రికార్డుల తాట తీస్తాయి. ఆ తర్వాత చడీచప్పుడు కాకుండా చాపచుట్టేస్తాయి. చాలాకాలం నుంచి ప్రతి సినిమా విషయంలోనూ ఇదే రిజల్ట్ వస్తోంది కాబట్టి.. ‘రంగస్థలం’కి కూడా అదే రిపీట్ అవుతుందని అనుకున్నారు.

కానీ.. ఆ అంచనాల్ని తిప్పికొడుతూ ఈ చిత్రం 9వ వారంలోనూ తన కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. అందుకే.. చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులు నమోదవుతున్నాయి. ఈ రన్‌లో ఇప్పటికే అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసి.. అత్యధిక వసూళ్ళు కొల్లగొట్టిన చిత్రంగా ‘నాన్-బాహుబలి’ ఘనత నమోదు చేసుకుంది. లేటెస్ట్‌గా మరో అరుదైన సెన్సేషన్ రికార్డ్‌ని కూడా ఈ చిత్రం క్రియేట్ చేసింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం విజయవాడలోని అప్సర థియేటర్‌లో 66వ రోజు రూ.1,00,000 గ్రాస్, రూ.50,000 షేర్‌ను రాబట్టినట్లు తేలింది. దీంతో ఓవరాల్‌గా ఆ థియేటర్లో రూ.1,05,63,000 గ్రాస్, రూ.61.22 లక్షల షేర్ నమోదైంది.

ఇంతకుముందు ‘ఇంద్ర’, ‘ఖుషీ’ సినిమాలు ఆ థియేటర్‌లో రూ.1 కోటి గ్రాస్ సాధించిన చిత్రాలుగా సంచలన రికార్డుల్ని నమోదు చేయగా.. ‘రంగస్థలం’ వాటిని బద్దలుకొట్టి మరో చరిత్ర సృష్టించింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఇంకా మిగిలివున్న ఇలాంటి రికార్డుల్ని ‘రంగస్థలం’ ఏరికోరిమరీ బ్రేక్ చేసేలా ఉంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.