‘రంగస్థలం’ సృష్టించిన మరో హిస్టారికల్ రికార్డ్

టాలీవుడ్ మార్కెట్ పెరుగుతూ వస్తున్నకొద్దీ మన స్టార్ హీరోలందరూ కలెక్షన్లపరంగా అనూహ్యమైన రికార్డుల్ని సృష్టిస్తున్నారు కానీ.. గతంలో కొన్ని చిత్రాలు నమోదు చేసిన రికార్డుల్ని మాత్రం ఎవ్వరూ క్రాస్ చేయలేకపోయారు. స్వయంగా ఆయా హీరోలే వాటిని అందుకోలేకపోయారు. అయితే.. రామ్ చరణ్ మాత్రం తన లేటెస్ట్ మూవీ ‘రంగస్థలం’తో ఆ రికార్డుల్ని బద్దలుకొట్టేశాడు. పదండి.. ఆ వివరాలు మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!

2013లో ‘అత్తారింటికి దారేది’తో పవన్ కళ్యాణ్ నైజాంలో రూ.25 కోట్ల షేర్ కొల్లగొట్టాడు. ‘బాహుబలి’ తర్వాత ఇదే హయ్యెస్ట్! ఈ రికార్డ్‌ని ఇన్నాళ్ళూ ఏ ఒక్క హీరో టచ్ చేయలేకపోయాడు. కానీ.. ‘రంగస్థలం’తో రామ్ చరణ్ ఆ మార్క్‌ని క్రాస్ చేయడమే కాకుండా రూ.28+ షేర్‌తో సెకండ్ హయ్యెస్ట్ స్థానం కొల్లగొట్టాడు. ఇంతేకాదు.. ఇదే నైజాం ఏరియాలో ఒక థియేటర్‌లో రూ.2 కోట్ల గ్రాస్ అందుకున్న ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. సరిగ్గా ఇలాంటి రికార్డ్‌నే మరొకటి సాధించాడు.

కృష్ణా జిల్లాలోని ఒక థియేటర్‌లో ‘రంగస్థలం’ రూ.1 కోటికిపైగా గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టినట్లు తేలింది. ఇంతకుముందు ఇదే ఏరియాలో పవన్ తన ‘ఖుషి’ చిత్రంతో రూ.1 కోటి గ్రాస్ రాబట్టి ట్రెండ్ సెట్ చేశాడు. మహేష్ కూడా ‘పోకిరి’తో అలాంటి రికార్డ్‌నే అందుకున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత రామ్ చరణ్‌ తన ‘రంగస్థలం’తో వాటిని కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు.

Related posts:
ఆలూ లేదు చూలూ లేదు.. అవన్నీ పుకార్లేనంటున్న ‘సర్దార్’
భారీ రేటుకు ‘అ..ఆ’ శాటిలైట్ రైట్స్.. ఆ సినిమా రికార్డ్ బ్రేక్!!
‘సెల్ఫీరాజా’ 3 రోజుల కలెక్షన్స్.. ఏరియాల వారీగా వివరాలు
‘అజ్ఞాతవాసి’ హంగామా.. ఫుల్ జబర్దస్త్‌రా మామా!
బోయపాటి సెకండ్‌కి చరణ్ ‘10’.. ఇది ఫిక్స్!
అఫీషియల్ : నాలుగు రోజుల్లోనే సెంచరీ కొట్టిన చరణ్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.