‘భరత్’, ‘రంగస్థలం’ల 47 లెక్క!

టాలీవుడ్ చరిత్రలో ఓసారి తొంగిచూస్తే.. బాక్సాఫీస్ బరిలో కొత్తగా వచ్చే సినిమాల హడావుడే ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు డీలా పడిపోవడమో, లేదా దాదాపు చాపచుట్టేయడమో జరిగింది. అంతేకానీ.. కొత్తగా వచ్చిన చిత్రాల్ని డామినేట్ చేసి మరీ ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన దాఖలాలు లేనేలేవు. ఫస్ట్ టైమ్.. ఆ మ్యాజిక్ చేసి చూపించింది ‘రంగస్థలం’! తనకంటే చాలా గ్యాప్‌తో కొత్తగా బరిలోకి దిగిన ‘భరత్ అనే నేను’ మూవీని వెనక్కు నెట్టేస్తూ.. సూపర్బ్ వసూళ్ళు కొల్లగొడుతోంది.

నిజానికి.. ‘రంగస్థలం’ రిలీజైన మూడు వారాల తర్వాత ‘భరత్ అనే నేను’ చిత్రం వచ్చింది. ఈరోజుల్లో సినిమాల లైఫ్ కూడా మూడు లేదా నాలుగు వారాలకంటే ఎక్కువగా లేదు కాబట్టి.. ‘భరత్’ బరిలోకి దిగాక ‘రంగస్థలం’ చాపచుట్టేయడం ఖాయం అనుకున్నారు. పైగా.. మహేష్ మూవీకి విపరీతమైన బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో.. ఇక చరణ్ చిత్రానికి కాలం చల్లినట్టేనని అనుకున్నారు. కానీ.. ఆ ఊహాగానాల్ని బోల్తాకొట్టిస్తూ ‘రంగస్థలం’ ఏడో వారంలోనూ దుమ్ముదులిపేస్తోంది. ‘భరత్’కి ధీటుగా బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబడుతోంది. ఇందుకు 47వ రోజు నమోదైన రిపోర్టే సాక్ష్యం!

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 47వ రోజున మార్నింగ్, మ్యాట్నీ షోలకు కలుపుకుని ‘రంగస్థలం’ రూ.80 వేలు కలెక్ట్ చేసింది. కానీ.. అదే రోజు అవే షోలకి కలిపి ‘భరత్ అనే నేను’ కేవలం రూ.45,000 గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. సేమ్ ఇలాంటి రిపోర్టే 46వ రోజు ఆదోనీలో నమోదైంది. ‘రంగస్థలం’ రూ.42,076 కలెక్ట్ చేస్తే.. ‘భరత్’ రూ.34,630 మాత్రమే రాబట్టింది. దీన్నిబట్టి.. ‘రంగస్థలం’ చిత్రం ఏ రేంజులో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.