ఈగో : చరణ్ సిక్స్.. బన్నీ జస్ట్ మిస్

స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌ తర్వాత సృష్టించబోయే ప్రభంజనాల సంగతేమోగానీ.. అంతకుముందు బిజినెస్ పరంగా మాత్రం పెద్ద సునామీయే సృష్టిస్తున్నాయి. భారీ అంచనాలు నెలకొనడంతో.. హీరోల మార్కెట్ వ్యాల్యూకి మంచి మరీ హక్కులు అమ్ముడవుతున్నాయి. లేటెస్ట్‌గా రామ్ చరణ్, అల్లుఅర్జున్‌ల ‘రంగస్థలం’, ‘నా పేరు సూర్య’ సినిమాలు అదిరిపోయే బిజినెస్ చేస్తున్నాయి. ఒకటి 1985 నేపథ్యంతో, మరొకటి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతుండడంతో.. ఈ చిత్రాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకే.. బయ్యర్లు కోట్లు కుమ్మరించి మరీ రైట్స్ కొంటున్నారు. తాజాగా ఈ రెండు చిత్రాల ఈస్ట్ గోదావరి జిల్లా హక్కులు భారీ రేట్లకు అమ్ముడయ్యాయి.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ‘రంగస్థలం’ హక్కుల్ని వింటేజ్ క్రియేషన్స్‌వారు అక్షరాల రూ.6 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే.. ‘నా పేరు సూర్య’ రైట్స్‌ని అనుశ్రీ ఫిల్మ్స్ సంస్థ రూ.5.40 కోట్లకు సొంతం చేసుకుంది. జస్ట్.. రూ.60 లక్షల తేడాతో బన్నీ వెనకుండి పోయాడు. అయినా.. ఈ రెండు ఫిగర్‌లు ఆ ఇద్దరి కెరీర్‌లలో రికార్డ్. ఎందుకంటే.. ఈస్ట్ గోదావరి ఏరియాలో ఇద్దరికీ అంత మార్కెట్ లేదు. వారి సినిమాలేవీ ఇప్పటివరకు ఆ మార్క్‌లని టచ్ చేయలేదు. అయినా అంత రేట్లు పలికాయంటే.. ఆ రెండు చిత్రాలపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి.. పెట్టిన పెట్టుబడిని ఈ రెండు చిత్రాలు రికవర్ చేస్తాయో లేదో వేచి చూడాలి.

ఇకపోతే.. సుకుమార్, చరణ్ కాంబోలో రూపొందుతున్న ‘రంగస్థలం’ మార్చి 30వ తేదీన రిలీజ్ అవుతుండగా.. వక్కంతం వంశీ, బన్నీ కాంబోలో తెరకెక్కుతోన్న ‘నా పేరు సూర్య’ ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది.

Related posts:
నాగ‌చైత‌న్య బంపర్ ఆఫర్ కొట్టేసిన నితిన్‌!
తట్టాబుట్టా సర్దేసుకున్న ‘రైట్ రైట్’.. ఇక మిగిలిందదే!
బ్రాండ్‌కి తగ్గట్టు రెమ్యునరేషన్ భారీగా పెంచిన కొరటాల శివ
‘ప్రేమమ్’ 24 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
ఫిదా 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. తెలుగు వారు ఫిదా!
ఆ విషయంలో మహేష్, చరణ్‌లకు ఏమాత్రం తీసిపోని మహానటి

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.