రంగస్థలం రెండు వారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. వందకోట్ల మగాడు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఇంకా ఏమాత్రం తగ్గించలేదు. చరణ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్‌కు జనాలు నీరాజనాలు పట్టడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ టేకింగ్‌తో మ్యాజిక్ చేసి ఈ సినిమాకు మరింత అందం తీసుకొచ్చాడు. మొత్తానికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన రంగస్థలం ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

రంగస్థలం చిత్రం రిలీజ్ రోజునే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో తొలిరోజునే రూ. 19 కోట్లకు పైగా వసూలు చేసి భారీ కలెక్షన్స్ దిశగా సాగింది. ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్లకు పైగా వసూలు చేసి తన సత్తా చాటుకున్నాడు చరణ్. తాజాగా ఈ చిత్రం రెండు వారాలు ముగిసే సరికి ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ టాప్-3 జాబితాలో చేరి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏరియాలవారీగా రంగస్థలం చిత్రం రెండు వారాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – రెండు వారాల కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 21.65 కోట్లలో
సీడెడ్ – 14.10 కోట్లు
నెల్లూరు – 2.69 కోట్లు
కృష్ణా – 5.80 కోట్లు
గుంటూరు – 7.10 కోట్లు
వైజాగ్ – 10.55 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6.33 కోట్లు
వెస్ట్ గాదావరి – 4.99 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 73.21 కోట్లు
కర్ణాటక – 8.00 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.55 కోట్లు
ఓవర్సీస్ – 16.40 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 100.16 కోట్లు

Related posts:
తార‌క్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌...వేట పూర్త‌య్యింది
కళ్ళు పోగొట్టుకున్న హీరో.. ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ ‘గ్యారేజ్’ టీజర్‌పై సమంత షాకింగ్ కామెంట్స్!
‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ ట్రైలర్ రివ్యూ : అంతకుమించి.. కానీ!
అదరగొట్టి సవ్యసాచి.. చైతూ కెరీర్‌లోనే ఇంట్రెస్టింగ్ టైటిల్
బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుతున్న తారక్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.