రంగుల రాట్నం మూడు రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ముక్కుతూ ములుగుతూ మూడు దాటింది!

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగుల రాట్నం’ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున నిర్మించారు. గతంలోనూ రాజ్ తరుణ్‌తో ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ్, రంగుల రాట్నంతోనూ అదే ఫార్ములాను రిపీట్ చేయాని చూశాడు. అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు ఎలాంటి బజ్ లేకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు జనం.

ఈ కారణంగా రంగుల రాట్నం చిత్రం రిలీజ్ రోజు నుండీ కలెక్షన్స్ పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. అంతేగాక పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జైసింహా, సూర్య గ్యాంగ్ చిత్రాలతో పోటీ పడటంలోనూ ఘోరంగా విఫలమయ్యింది ఈ సినిమా. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా చాలా వీక్‌గానే వచ్చాయి. ఈ సినిమా మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 3.69 కోట్లు సాధించింది. ఇక ఈ చిత్ర కలెక్షన్స్ ఏరీయాలవారీగా ఈ విధంగా ఉన్నాయి..

ఏరియా – 3 రోజుల కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 0.72 కోట్లు
సీడెడ్ – 0.53 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.59 కోట్లు
గుంటూరు – 0.29 కోట్లు
తూర్పు గోదావరి – 0.55 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.28 కోట్లు
కృష్ణా – 0.15 కోట్లు
నెల్లూరు – 0.09 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 3.20 కోట్లు
కర్ణాటక – 0.30 కోట్లు
రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్ – 0.19 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 3.69 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.