బంతాటాడుతున్న ఛలో భామ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. పూర్తి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌ుతున్న ఈ సినిమాలో ‘ఛలో’ ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే చిత్ర యూనిట్ నుండి అందుతున్న స‌మాచారం ప్రకారం ఈ మూవీలో రష్మిక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కనిపించనుంది. అంతేగాకుండా.. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ క్రికెట్ అకాడమీలో గ‌త కొంత‌కాలంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట ఈ బ్యూటీ. సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు రష్మిక ఇలా క్రికెట్ కోచింగ్ తీసుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు చిత్ర యూనిట్. కాగా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్నారు. జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మరి ఈ సినిమా రష్మిక కెరీర్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.