నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న రవితేజ రేటు!

ఎన్ని హిట్లు వచ్చినా సరే.. మార్కెట్ వ్యాల్యూని బట్టే హీరోలు తమకంటూ ఒక రేటు ఫిక్స్ చేసుకుంటారు. నిర్మాతలు సైతం మార్కెట్ లెక్కల్ని బట్టే హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ.. మాస్ మహారాజా రవితేజ ఎందుకో ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. తాను అడిగిందే ఇవ్వాలంటూ మొండికేసుకుని కూర్చున్నాడు. ‘బెంగాల్ టైగర్’ తర్వాత తనకు రూ.10 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ రవితేజ పట్టుబడటంతో.. ఏ ఒక్క నిర్మాత అతనితో పనిచేసేందుకు ముందుకు రాలేదు.

అంతెందుకు.. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన నిర్మాత దిల్‌రాజుతో విభేదాలు తలెత్తాయి. అందుకే.. అప్పట్లో ‘ఎవడో ఒకడు’ మూవీ ఆగిపోయింది. చివరికి రవితేజే కాస్త వెనక్కి తగ్గడంతో.. మళ్ళీ దిల్‌రాజుతో క్లోజ్ అవ్వడం ‘రాజా ది గ్రేట్’ రూపొందడం జరిగింది. కానీ.. ఇక్కడే మరో చిక్కొచ్చిపడింది. ఆ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో.. రవితేజ మళ్ళీ కొండెక్కి కూర్చున్నాడు. లేటెస్ట్ మూవీ ‘టచ్ చేసి చూడు’ ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ.. రవితేజ వెనక్క తగ్గడం లేదు. తనకు రూ.13 కోట్లు పారితోషికం ఇవ్వాల్సిందేనంటూ మళ్ళీ మొండికేసి కూర్చున్నాడట. లేటెస్ట్‌గా కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ‘‘నేల‌టిక్కెట్’’ సినిమాకు రవితేజ అంత డిమాండ్ చేశాడట. నిర్మాతలు కాస్త తగ్గించుకోమని రిక్వెస్ట్ చేసినా.. రవితేజ వినకపోవడంతో చివరికి రూ.13 కోట్లు సమర్పించుకున్నారు.

నిజమే.. రవితేజ పెద్ద స్టార్ హీరోనే! కానీ.. అతని మార్కెట్ వ్యాల్యూ కూడా పెద్దగా లేదన్న విజయం మాత్రం వాస్తవం. ‘రాజా ది గ్రేట్’తో రూ.30 కోట్ల మార్క్ తొలిసారి దాటాతే తప్ప.. అంతకుమించి మరే వేరే చిత్రాల్లేవు. పైగా.. రవితేజ సినిమాలో పెద్ద ఆర్టిస్టులు వుంటారు. వాళ్ళ పారితోషికంతోపాటు నిర్మాణ ఖర్చులు ఎక్కువగానే వుంటాయి. అలాంటప్పుడు తన వ్యాల్యూనే బట్టే రవితేజ రెమ్యునరేషన్ తీసుకోవాలి. కానీ.. ఇతను మాత్రం పట్టుబడి ఎక్కువ డిమాండ్ చేయడం సబబు కాదని విశ్లేషకుల అభిప్రాయం. అటు వేరే నిర్మాతలు కూడా ఈ రేటు చూసి భయపడుతున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.