పండగ రోజు ‘నేలటికెట్’ చించుతున్న రవితేజ

మాస్ రాజా రవితేజ కొంతగ్యాప్ తీసుకుని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా ‘టచ్ చేసి చూడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చి బొక్కబోర్లా పడ్డాడు. అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించడంలో రవితేజ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ నేల టికెట్ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చిందట. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది రోజున ‘నెల టికెట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా పక్కా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ మరో లెవెల్‌లో ఉండనుందని వారు అంటున్నారు. ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరరన జరుపుకుంటున్న ‘‘నేలటికెట్’’ చిత్రంపై అప్పుడే బజ్ క్రియేట్ అయ్యింది.

రవితేజ మార్క్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఫిదా ఫేం శక్తికాంత్ మ్యూజిక్ అందిస్తుండగా రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.