టీజర్ టాక్ : ‘నేల’ నాకించేసిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నేల టిక్కెట్’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. కళ్యాణ్ ఇదివరకు ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి క్లాసిక్ హిట్స్ అందుకోవడంతో.. ఈ మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి. క్లాస్, మాస్ కాంబోలో తెరకెక్కుతోంది కాబట్టి.. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రత్యేకంగా వుంటుందనే ఆశలు రేకెత్తాయి. కానీ.. టీజర్ ఆ ఆశల్ని నీరుగార్చేసింది.

ఈరోజు (22-04-18) ఉదయం చిత్రబృందం రిలీజ్ చేసిన టీజర్.. మొదట్నుంచి చివరకు ఫ్లాట్‌గానే ఉంది. ఎక్కడా ‘వావ్’ అనిపించే ప్రత్యేక అంశాలే లేవు. ఫస్ట్‌లో తన స్నేహతులతో కలిసి జాతరలో డ్యాన్స్ చేస్తూ రవితేజ దర్శనమిస్తాడు. ఈ టీజర్‌ని డ్యాన్స్‌తోనే లాగించేశారు. అయితే.. రవితేజ మార్క్ మాత్రం నవ్వులు పూయిస్తుంది. తన కోతి చేష్టలు, హావభావాలతో మాస్ రాజా కితకితలు పెట్టించాడు. హీరోయిన్ మాళవికని తన ముగ్గులో దింపే ప్రయత్నంలో భాగంగా తన మార్క్ కామెడీతో అలరించాడు. చూస్తుంటే.. చాలారోజుల తర్వాత రవితేజ తన పాత కామెడీ స్టైల్‌తో మెప్పించేలా కనిపిస్తున్నాడు.

ఇక చివర్లో ‘నేల టిక్కెట్ గాడితో పెట్టుకుంటే నేల నాకించేస్తాను’ అనే డైలాగ్‌తో పూనకాలు తెప్పించాడు. తన మార్క్ యాక్షన్‌తో మాస్ ఆడియెన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించారు. మాళవిక అందంగా తళుక్కుమంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ‘ఓసారి ట్రై చెయ్’ థీమ్ టీజర్‌కి తగ్గట్టు బాగానే మ్యాచ్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, దర్శకుడి టేకింగ్ అన్నీ కుదిరాయి. అంతా బాగానే వుంది కానీ.. ప్రత్యేక ఎలిమెంట్స్ లేకపోవడమే మైనస్. దీనికి నేటిసినిమా ఇచ్చే రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.