ఎన్టీఆర్‌కు పోటీగా వస్తున్న చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించాడు. ఇప్పుడు మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు చరణ్.

కాగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానిక వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట చిత్ర యూనిట్. అదే సమయంలో బాలయ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్‌టిఆర్ బయోపిక్ కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఈ రెండు చిత్రాల నడుమ పోటీ రసవత్తరంగా మారనుంది. చరణ్ 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తోంది.

రక్తచరిత్ర హీరో బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబేరాయ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరి సంక్రాంతి బరిలో ఏ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.