బిత్తిరి చేష్టలకు పవన్ ఫ్యాన్స్ తిక్క లేసింది!

Tellmeboss.net

వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా అశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్‌పై దాడి జరగడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్తున్నప్పుడు సరిగ్గా కార్యాలయానికి దగ్గరలో హెల్మెట్‌తో వేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా సత్తిపై ఎటాక్ చేసి.. తీవ్రంగా గాయపరిచారు. దీంతో.. గాయపడిన సత్తిని కార్యాలయ సిబ్బంది వెంటనే బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించింది.

Tellmeboss.net

అసలు తన కామెడీ డైలాగులతో, విచిత్రమైన చేష్టలతో తెలుగువారిని కడుపుబ్బా నవ్వించే బిత్తిరిని దాడి చేసేంత పరిస్థితి ఎందుకొచ్చిందా? అని ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ సత్తిపై దాడి చేసిన దుండగులు ఏం చెప్తారు? ఏదైనా మిస్టరీ దాగుందా? అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి.. పోలీసులు నాలుగు తగిలించాక వాళ్లు నోరు విప్పారు. ‘తీన్మార్’ కార్యక్రమంలో తెలంగాణ యాసను అవమానించినట్టు ఉండటమే కాక, పవన్ కళ్యాణ్‌ను విచిత్రమైన పేర్లతో పిలుస్తూ ‘సత్తి’ అవమానిస్తున్నాడని.. ఆ కారణంగానే అతనిపై దాడికి పాల్పడినట్లు నిందుతులు వెల్లడించినట్లు సమాచారం. నిందితులు మద్యం మత్తులోనే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

కమెడియన్స్ అన్నాక సెలబ్రిటీల్ని అనుకరించడం, తమదైన స్టైల్లో కామెడీ పండించడం అనేది ఒక ఆర్ట్. దాన్ని అభినందించాల్సింది పోయి.. ఇలా దాడి చేయడం ఏమాత్రం సబబు కాదు. కామెడీని, రియాలిటీకి కూడా తేడా తెలియకుండా ఇంకెందుకు?

Tellmeboss.net
Related posts:
యువకుడిని రైలుకి కట్టేసి చిత్తకొట్టారు.. కారణం వింటే షాక్! (వీడియో)
‘చిన్నారి పెళ్ళికూతురు’ సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్
వంద కోట్ల భర్త కావాలన్న అమ్మడికి ముఖేష్ అంబానీ లేఖ
ఆ డైరెక్టర్‌తో సహజీవనం చేసింది ఈ యాంకరమ్మే!! (ఫోటోలు)
ఎన్టీఆర్‌పై భారీ కుట్ర.. ఈ పిచ్చి అభిమానం ఏంటో?
ట్విట్టర్ సాక్షిగా.. ఇవాంకా మీద నవదీప్ ఎటాక్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.