గోపీచంద్ కొంపముంచిన ఎన్టీఆర్.. అంతా అస్సామే!

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆక్సిజన్’ గత వారం రిలీజ్ అయ్యి ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా చాలా వెనుకబడటంతో డిజాస్టర్‌గా మిగలడం ఖాయం. ఇక ఈ సినిమాకు తీరని నష్టం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అదేంటి.. గోపీచంద్ సినిమాతో ఎన్టీఆర్‌‌కు లింకేంటి అనుకుంటున్నారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిని విషయం తెలిసిందే. గోపీచంద్ ఆక్సిజన్ సినిమాలోని ఫస్ట్‌ హాఫ్ తారక్ రామయ్య వస్తావయ్యా చిత్రంలోనుండే తీసుకున్న విషయం సినిమా చూస్తే తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కనిపెట్టిన వారు సినిమా ఫస్ట్‌హాఫ్‌లోనే థియేటర్ నుండి బయటకు వచ్చేస్తున్నారు. తారక్ సినిమాను రిజెక్ట్ చేసిన జనం గోపీచంద్ సినిమాకు అదే రిజల్ట్‌ను రిపీట్ చేశారు.

ఏదేమైనా తారక్ సినిమాలోని సీన్స్‌ను తామ వాడుకుంటే సినిమాకు కలిసొస్తుందని అనుకున్నారు గోపీచంద్ అండ్ టీమ్. కానీ.. తారక్ వారి ఆశలపై పరోక్షంగానే నీళ్లు చల్లాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న గోపీచంద్‌ కెరీర్‌కు ఇప్పుడు ఖచ్చితమైన హిట్ కావాల్సిందే.

Related posts:
‘రైట్ రైట్’ అంటూ అందరికీ షాకిచ్చిన సాయిధరమ్ తేజ్
క్రికెటర్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఆటాపాటా
30 రోజుల్లో ఎన్టీఆర్ సాధించిన అరుదైన రికార్డులు ఇవే!
‘శాతకర్ణి’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్.. ఆరోజు దబిడిదిబిడే!
మెగా బ్రదర్‌ కొంప కొల్లేరు చేసిన సూర్య!
క్రిష్ కాపురంలో నిప్పులు పోసిన హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాకే!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.