వర్మ దెబ్బకు పారిపోయిన ఆఫీసర్!

వివాదాలకు కేరాఫ్‌గా నిలచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్‌‌. ఇటీవల జీఎస్టీ అనే చిత్రం తీసి యావత్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు అక్కినేని నాగార్జునతో కలిసి ‘ఆఫీసర్’ అనే చిత్రంతో మనముందుకు రావడానికి రెడీ అయ్యాడు వర్మ. కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోవడం గమనార్హం. అయినా వర్మ టేకింగ్ స్టయిల్‌కు చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆఫీసర్ చిత్రం ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.

కాకపోతే వర్మ గత చిత్రాలు ఏవీ కూడా బాక్సాఫీస్‌ వద్ద సరిగ్గా ఆడలేదు. సక్సెస్ అనే మాటకు వర్మ చాలా దూరం వెళ్లిపోవడంతో ఆయనతో సినిమాలు చేసి ఫ్లాప్ మూటగట్టుకునే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ నాగార్జున మాత్రం దీనిని బ్రేక్ చేసి వర్మతో సినిమా చేశాడు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాయి. కానీ వర్మ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తాడా అని నాగ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. కాగా ఈ సినిమాను మే 25న రిలీజ్ చేయాలని చూసిన వర్మ ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అమాంతం జూన్ 1కి వాయిదా వేశాడు. కొన్ని టెక్నికల్ పనుల కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు వర్మ క్లారిటీ ఇచ్చాడు.

మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాలో నాగ్ ఒక కాప్‌గా మనకు కనిపిస్తాడు. మైరా సరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్‌పై వర్మ నిర్మిస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.