ట్రైలర్ టాక్: ఈ ఆఫీసర్ చాలా పాతవాడు!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆఫీసర్’పై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగార్జున నటిస్తుండటం. వీరిద్దరు గతంలో శివ లాంటి ఇండస్ట్రీ హిట్ అండ్ ట్రెండ్ సెట్టర్ మూవీని ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో మనముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఆఫీసర్ చిత్ర పోస్టర్స్, టీజర్‌ జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్ర యూనిట్ తాజాగా ఆఫీసర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌తో నిండిఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కాప్ పాత్రలో నాగ్ సీరియస్ లుక్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ ట్రైలర్‌లో నాగ్ పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. కానీ ఇందులో చిత్ర స్టోరీలైన్ తేలిపోయిందని చెప్పాలి. పాతకాలం నాటి నుండి వస్తున్న పోలీస్-మాఫియా వార్ కథను మరోసారి వర్మ మనముందుకు తీసుకొస్తున్నట్లు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమాలో నాగ్‌తో పాటు మీరా సరీన్ నటిస్తోంది. ఈ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తుండగా వర్మ సొంత బ్యానర్ ‘కంపనీ’పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.