టీజర్ టాక్: ఆఫీసర్‌తో భయపెడుతున్న వర్మ.. నాగ్ కర్మ!

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆఫీసర్ రిలీజ్‌కు రెడీగా ఉంది. వివాదాలకు కేరాఫ్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ్ ఒక కాప్‌గా కనిపిస్తాడు. గతంలో పాతికేళ్ళ క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శివ ఎలాంటి చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో మనముందుకు వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనాలు.

ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్‌తో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్స్, టీజర్ చిత్రంపై అంచనాలను పెంచడంలో సక్సె్స్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో టీజర్‌ను రిలీజ్ చేశాడు వర్మ. అయితే ఈ టీజర్‌లో చెప్పుకోదగ్గ విధంగా ఆకట్టుకునే అంశాలైతే ఏమీ లేవు. యాక్షన్ ప్లస్ ఎమోషన్‌ను కలగలిపి ఈ టీజర్‌ను మనకు చూపించాడు వర్మ. నాగ్‌కు తన కూతురితో ఉన్న ఎమోషన్‌తో పాటు దుండగులను మట్టుబెట్టే యాక్షన్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ టీజర్‌లోనూ ఇలాంటి సీన్స్‌ మనకు కనిపించాయి.

మరి వర్మ తెరకెక్కించిన ఈ ఆఫీసర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను రాబడతాడో చూడాలి. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మే 12న రిలీజ్ చేస్తున్నాడు వర్మ.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.