న్యూస్ అంటే ఇది.. బాలయ్యకు అదిరిపోయే ట్విస్ట్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. అలనాటి లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోంది ‘మహానటి’. ఇక ఈ జాబితాలో ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నది ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవిత కథను నందమూరి బాలకృష్ణ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే బాలయ్య కంటే ముందే ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతో కోణంలో రూపొందించనున్నాడు వర్మ.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ఫస్ట్‌ లుక్ పోస్టర్‌తో ఇప్పటికే అలజడి సృష్టించాడు వర్మ. ఇప్పుడు ఈ చిత్ర తారాగణంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడనే వార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇక సినిమాలో లీడ్ రోల్‌గా కనిపించే లక్ష్మీ పార్వతి పాత్రలో ఒకప్పటి టాప్ హీరోయిన్ మరియె వైయస్‌ఆర్‌సీపీ లీడర్ అండ్ MLA రోజా నటించనుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే రోజా, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి రోల్‌లో వీరంగం సృష్టించడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ చిత్రం కథ, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగుపెట్టినప్పటి నుండి సాగుతోందట. ఈ చిత్రాన్ని వైయస్‌ఆర్‌సీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కళ్లు చెదిరే బడ్జెట్ కేటాయించనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరలో ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి సన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts:
మ‌హేష్ డైరెక్ట‌ర్‌తో ఫుల్ మాస్ మూవీకి ఎన్టీఆర్ రెఢీ...ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీ
టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో టాప్ హీరోయిన్ ఎఫైర్‌
పండగలా దిగివచ్చాడు.. ‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్లకు మాటిచ్చాడు!!
ఆ పాపతో చిరు చిందులు..?
కోరుకున్న వ్యక్తితోనే కాజల్ పెళ్లి.. వరుడు వివరాలు ఇవే!
ఆ డైరెక్టర్ సాక్షిగా.. తారక్‌ని దెబ్బేసిన దిల్‌రాజు!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.