సూర్యకు లాక్ పడింది.. ఇక గ్యాంగ్ రెచ్చిపోవడం ఖాయం!

Tellmeboss.net

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య తన గ్యాంగ్ సినిమాతో సంక్రాంతి సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సూర్య మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర రన్‌టైమ్‌ను లాక్ చేశారు చిత్ర యూనిట్.

Tellmeboss.net

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్‌టైమ్‌ను 2 గంటల 18 నిమిషాలకు లాక్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్ర ఔట్‌పుట్ అదిరిపోయే రేంజులో వచ్చిందని అంటున్నారు యూనిట్ మెంబర్స్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘‘స్పెషల్ 26’’కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో సూర్యతో పాటు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇక హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతుంది. అయితే అదే రోజున బాలయ్య జై సింహా కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మరి ఈ పోటీలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.