‘సాహో’ సెట్స్‌లో భారీ ధ్వంసం.. 37 కార్లు – 4 ట్రక్కులు మటాష్

తెలుగులో రూపొందుతున్న అత్యంత క్రేజీ, భారీ ప్రాజెక్టుల్లో ‘సాహో’ చిత్రం ఒకటి! ‘బాహుబలి’లాంటి మ్యాగ్నమ్ ఓపస్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో.. దేశవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకే.. నిర్మాతలు ఈ చిత్రం కోసం ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జస్ట్.. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే ఈ మూవీ మేకర్స్ కళ్ళుచెదిరే బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలిసింది. సరైన ఫిగర్ అయితే బయటకు రాలేదు కానీ.. సెట్టింగ్స్ చూస్తే మాత్రం ఏ రేంజులో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.

దుబాయ్‌లో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీన్ కోసం 4 భారీ ట్రక్కులు, 37 suv కార్లతో ఒక భారీ ఛేజింగ్ సీన్స్‌ని చిత్రీకరించారు. ఈ సీన్‌లో ఆ కార్లతో ట్రక్కులు ఢీకొట్టుకుంటాయి. అంటే.. మొత్తం ధ్వంసం అయిపోతాయి. నిజానికి.. ఇలాంటి సీన్లను గ్రాఫిక్స్‌లో తక్కువ అమౌంట్‌లోనే తీయొచ్చు. కానీ.. రియలిస్టిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో కావాలనే భారీ బడ్జెట్ వెచ్చించిమరీ ఈ సీన్ షూట్ చేశారు. ముందుగా అనుకున్న దానికంటే బడ్జెట్ హద్దులు దాటిపోతున్నా.. నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఖర్చు చేయడం నిజంగా గొప్ప విషయమే!

దీన్ని బట్టి.. ఈ చిత్రంపై వాళ్ళకెంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్.. ఈ నమ్మకానికి ప్రభాస్ ఇంటర్నేషన్ ఇమేజ్ కూడా తోడుగా ఉందిలెండి! ఇప్పుడు అతనికున్న క్రేజ్‌ని బట్టి చూస్తే.. బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయగలడన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ఆ నమ్మకంతోనే నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడట్లేదు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.