టీజర్ టాక్: బెల్లంకొండకు హిట్ పక్కా.. ఇదే ‘సాక్ష్యం’!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాక్ష్యం’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే బెల్లంకొండ బాబు హిట్ కొట్టడం ఖాయం అని తెలుస్తోంది.

సాక్ష్యం టీజర్‌ చూడటానికి చాలా గ్రాండ్‌గా ఉంది. ‘‘ఈ భూమ్మీద తప్పు చేసిన ప్రతీ ఒక్కరు నాలుగు దిక్కులు వెతికి ఎవ్వరూ చూడలేదనుకుంటారు.. కానీ పైనుంచి ఐదవ దిక్కెప్పుడూ చూస్తూనే ఉంటుంది.. అదే కర్మ సాక్ష్యం.. దాన్నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు..’’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివస్ మరోసారి తనకండలతో గూండాల పని పడుతూ మనకు కనిపించాడు. అందాల భామ పూజా హెగ్డే ట్రెడీషినల్ లుక్‌తో మనకు ఈ టీజర్‌లో చాలా కొత్తగా కనిపించింది. భారీ తారాగణంతో శ్రీవాస్ మరోసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మనకు అందిస్తున్నాడు. ఇక మెయిన్ విలన్‌గా జగపతి బాబును చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. ఈ చిత్ర కథ మొత్తం దివ్య-శక్తుల చుట్టూ తిరగనుందని మనకు టీజర్ చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది.

ఈ టీజర్‌లో చాలా అందమైన లొకేషన్లతో పాటు అదిరిపోయే గ్రాఫిక్స్ కూడా కనిపించాయి. దీన్ని బట్టే ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారని చెప్పొచ్చు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ టీజర్‌కు నేటిసినిమా.కామ్ ఇచ్చే రేటింగ్: 3/5

Related posts:
అంతా కొత్తవారితో జబర్దస్త్ ప్రోగ్రామ్
చరణ్ లవ్ స్టోరీకి ముహూర్తం ఫిక్స్ చేసిన లెక్కల మాస్టారు
ఎందుకు చెప్పను బ్రదర్ అన్నాడో చెప్పేశాడు
‘శాతకర్ణి’పై జక్కన్న షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఆగ్రహం?
జైసింహా ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. బాలయ్యకే జై కొట్టిన జనం
హీరోయిన్ కోసం ప్రభాస్ పూజా ఫలించిందోచ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.