ఎంపీగా మరో రికార్డ్ సృష్టించిన సచిన్

Sachin Tendulkar Create New Record

ఇన్నాళ్లూ మైదానంలో బ్యాటు చేతపట్టుకుని ఎన్నో రికార్డులు తన పేరున లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎంపీగా మరో రికార్డును సృష్టించాడు. నిజానికి సచిన్ సభకు గౌర్హాజరైన శాతం 90%పైనే వున్నప్పటికీ.. మిగతా ఎంపీలు చేయలేని పనిని చేసి.. ఎంపీగా తన సత్తా చాటాడు లిటిల్ మాస్టర్.

సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా 12 సార్లు సభాసమావేశాలు జరిగాయి. మొత్తం 235 రోజులపాటు సభ జరిగితే.. సచిన్ హాజరైంది కేవలం 13 రోజులు మాత్రమే. 11వ సెషన్ వరకు సభలో ఏమాత్రం నోరుమెదపని సచిన్.. 12వ సభా సమావేశాల్లో మాత్రం తనదైన శైలిలో 7 ప్రశ్నలు సంధించాడు. ఇలా ప్రశ్నలు సంధించి సచిన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చిన సమయంలో సచిన్ సభకు హాజరుకాలేదు.

మరోవైపు.. తనకు కేటాయించిన ఎంపీల్యాడ్స్ నిధుల వినయోగంలోనూ సచిన్ ఇతర ఎంపీలకంటే మెరుగైన స్థితిలో వున్నాడు. ఇప్పటివరకు సచిన్ తనకు కేటాయించిన నిధుల్లో 98 శాతాన్ని ఖర్చు చేశాడు. తమిళనాడు వరద బాధితుల కోసం రూ.50 లక్షలు, ఏపీలోని పి.ఆర్.కండ్రిగ గ్రామాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళడంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రాజెక్టులకు సచిన్ నిధులు విడుదల చేస్తున్నాడు. ఇలా ఈ విధంగా సచిన్, సభలో ప్రశ్నలు సంధించడం, కేటాయించిన నిధుల వినియోగంలో ఇతర ఎంపీలకంటే మెరుగ్గా వుంటూ రికార్డు సృష్టించాడని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.