సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్‌ల ‘జవాన్’ మూవీ రివ్యూ-రేటింగ్

jawaan movie review rating

సినిమా : జవాన్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, ప్రసన్న, తదితరులు
దర్శకుడు : బివిఎస్ రవి
నిర్మాత : కృష్ణ, దిల్‌రాజు (సమర్పకుడు)
బ్యానర్ : అరుణాచల్ క్రియేషన్స్
సంగీతం : ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ : కెవి గుహన్
ఎడిటర్ : ఎఆర్ శేఖర్
రిలీజ్ డేట్ : 01-12-2017

మెగాహీరో సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’. మెహ్రీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స్నేహ భర్త ప్రసన్న విలన్‌గా నటించాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రంపై రిలీజ్‌కి ముందు పాజిటివ్ బజ్ ఏర్పడడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. అందుకు తగినట్లుగానే ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
జై (సాయి ధరమ్ తేజ్).. ఇతనికి తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో అన్నీ పనులు చేస్తూ బాధ్యతగల అబ్బాయిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. కెరీర్ పరంగా ‘డీఆర్‌డీఓ’లో ఒక సైంటిస్ట్ అవ్వాలనేదే జై కోరిక. కట్ చేస్తే.. ఆ సంస్థలోని సైంటిస్ట్‌లు చాలా సంవత్సరాల నుంచి ఇండియన్ ఆర్మీ కోసం ‘అక్టోపస్’ అనే మిసైల్‌ని తయారు చేస్తుంటుంది.

ఈ మిసైల్ గురించి తెలుసుకున్న విలన్ (ప్రసన్న).. దాన్ని దక్కించుకుని, ఇంటర్నేషనల్ మాఫియాకి అమ్మేయాలని డీల్ కుదుర్చుకుంటాడు. ఈ విషయం తెలిసిన జై.. విలన్ ఎత్తుగడిల్ని తిప్పికొడుతుంటాడు. ఈ క్రమంలో అతని ఫ్యామిలీని ప్రసన్న కిడ్నాప్ చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రసన్న నుంచి జై తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు? ఆ మిసైల్ అతనికి దక్కకుండా ఎలాంటి ప్లాన్స్‌ వేస్తాడు? అనేదే ఈ సినిమా కథ.

విచారణ :
ఈ తరహా కథల్ని ఎంచుకున్నప్పుడు స్ర్కీన్‌ప్లేతో మ్యాజిక్ చేయాలి. బివిఎస్ రవి కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు కానీ.. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. థ్రిల్లింగ్ కథని తీర్చిదిద్దే ఆస్కారం ఉన్నప్పటికీ.. అక్కడక్కడ మాత్రమే ఆకట్టుకున్నాడు కానీ ఓవరాల్‌గా మాత్రం కిక్ ఇవ్వలేకపోయాడు. రెండు, మూడు సీన్లతో ఆసక్తి రేకెత్తిస్తే.. ఆ తర్వాత డల్ నెరేషన్‌తో తలతిరిగేలా చేశాడు. పతాక సన్నివేశాల్లో కూడా ఇదే బాపతు.

మొదట్లో ఈ చిత్రం ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరో క్యారెక్టరైజేషన్‌ని డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంది. కాసేపు రొటీన్ స్టోరీ సాగాక.. కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడే దర్శకుడు దెబ్బేశాడు. నరేషన్ ఇంప్రెసివ్‌గా లేకపోవడంతో కాస్త విరక్తి పుడుతుంది. ముఖ్యంగా.. డీఆర్‌డీఓ ఎపిసోడ్ మొత్తం అంత కన్వీన్స్‌గా అనిపించలేదు. హీరో, విలన్ మధ్య వచ్చే కొన్ని సీన్లు బాగున్నాయి. కానీ.. పాటలు మాత్రం ట్రాక్ తప్పించేశాయి. అవసరం లేని చోట్లలో పాటలు ఇరికించేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరింది.

సెకండాఫ్ విషయానికొస్తే.. ఇదే ఈ చిత్రానికి కీలకం. స్టార్టింగ్ పాయింటే చాలా డిఫరెంట్‌గా, ఆసక్తిగా ఉంది. హీరో ఫ్యామిలీతో విలన్ ఆటాడుకోవడం మొదలుపెడతారు. వాళ్లని కాపాడుకోవడం హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి. విలన్, హీరో మధ్య సాగే మైండ్‌గేమ్ కట్టిపడేస్తుంది. కానీ.. కథ సాగేకొద్దీ ఆ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. రొటీన్ ఫార్మాట్‌లో సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ పరమ రొటీన్‌గా ఉన్నాయి. ఇదివరకే వందలకొద్దీ సినిమాల్లో అలాంటి ఎండింగ్స్ చూశామనే ఫీలింగ్స్ ఖచ్చితంగా కలుగుతుంది.

ఓవరాల్‌గా చెప్పాలంటే.. జవాన్ కేవలం అక్కడక్కడ మాత్రమే మెప్పించగలిగాడు. మంచి క్యాస్టింగ్, అదిరిపోయే డైలాగ్స్, సోషల్ మెసేజ్ కథ, అదిరిపోయే టెక్నికల్ టీం సపోర్ట్ ఉన్నప్పటికీ.. దర్శకుడు బివిఎస్ రవి చిత్రాన్ని పర్ఫెక్ట్‌గా తెరకెక్కించడంలో తడబడ్డాడు. హీరో, విలన్‌ల మధ్య సాగే మైండ్‌గేమ్, కొన్ని సీన్లతో ఆకట్టుకున్నాడే తప్ప.. మిగతాదంతా రొటీన్ రొడ్డకొట్టుడుతో రబ్బర్‌ బ్యాండ్‌లా సాగదీశాడు.

నటీనటుల ప్రతిభ :
గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో సాయిధరమ్ తేజ్ చాలా మెచ్యూర్డ్‌గా నటించాడు. మునుపటిలా ‘అతి’ని ప్రదర్శించకుండా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అదరహో అనిపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తన భుజాలపై సినిమాని నడిపించాడు. మెహ్రీన్ పిర్జాదా ఇందులో చాలా గ్లామరస్‌గా కనిపించింది. ఇప్పటివరకు నటించిన సినిమాల్లోకెల్లా ఇందులో అందాల్ని ధారబోసింది. విలన్‌గా ప్రసన్న అదరగొట్టేశాడు. తేజుకీ ధీటుగా నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు మామూలే.

టెక్నికల్ ప్రతిభ :
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. థమన్ పాటలు బాగున్నాయి.. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి తెలిసిందే. మరోసారి తన ట్యాలెంట్‌తో థమన్ ఇరగదీసేశాడు. కొన్ని చోట్ల బీజీఎమ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ ఓకే. దర్శకుడు బివిఎస్ రవి.. అక్కడక్కడ మెప్పించాడే తప్ప, పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయాడు.

చివరగా : సూ‘పూర్’ స్ర్కీన్‌ప్లే!
రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.