పవన్‌లాగే గొంతును బిగించుకుని.. ‘అజ్ఞాతం’లోకెళ్లిన తేజు

sai dharam tej to play software employee in vinayak film

పవన్‌కళ్యాణ్‌కి సాయి ధరమ్ తేజ్ పరమభక్తుడు. ఆయన పేరు వింటే చాలు.. సాటి అభిమానిలాగే నరాలు తెగిపోయేలా ఉత్సాహంతో ఉర్రూతలూగిపోతాడు. తానూ ఒక హీరో అనే సంగతిని పక్కనపెట్టి.. ‘పవర్‌స్టార్’ నామజపంలో మునిగిపోతాడు. అలాంటి భక్తుడికి తాను ఎంతో అభిమానించే పవన్ అడుగుజాడల్లో నడిచే ఛాన్స్ వస్తే వదులుకుంటాడా? అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికైనా సిద్ధపడతాడు. ఇప్పుడు అటువంటి అవకాశమే అతనికి ఇప్పుడొచ్చింది. పదండి.. దాని వివరాలేంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతన్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపిస్తున్న విషయం ఇప్పటికే కన్ఫమ్ అయిపోయింది. ‘తీన్‌మార్’ తర్వాత ఆయన మళ్ళీ టై కట్టుకుని ఇందులో దర్శనమివ్వనున్నాడు. ఇప్పుడు ఇదే తరహాలో సాయి ధరమ్ తేజ్ కూడా తన తదుపరి చిత్రంలో ఐటీ ఉద్యోగిగా కనిపించనున్నట్లు తెలిసింది. వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న హీరో.. అందులో పవన్‌లాగే గొంతుకి టై కట్టుకుని స్టైల్ ఇవ్వనున్నాడు. ఇదండి అసలు సంగతి! డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న ఈ హీరో తొలిసారి పవన్ బాటలో నడిచి హిట్ అందుకుంటాడా? లేదా? వెయిట్ చేయాల్సిందే.

విచిత్రం ఏంటంటే.. ఈ ఐటీ ఉద్యోగి పాత్రని ఆల్రెడీ రామ్ చరణ్ ‘నాయక్’ మూవీలో, అల్లుఅర్జున ‘ఆర్య-2’లో కూడా పోషించారు. ఆ ఇద్దరూ ఆ క్యారెక్టర్‌లో ప్రేక్షకుల్ని మెప్పించడంతో ఆయా సినిమాలతో హిట్స్ దక్కించుకున్నారు. మరి.. తేజు విషయంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో? అతడ్ని సాఫ్ట్‌వేర్‌గా జనాలు అంగీకరిస్తారో? లేదో? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.