మెగా ఛాన్స్ కొట్టేసిన ‘గురు’ బ్యూటీ!

వెంక‌టేష్‌తో గురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్. నిజ జీవితంలో కూడా బాక్స‌ర్ అయిన రితికా సింగ్ సినిమాలో కూడా ఆ రోల్‌లోనే న‌టించింది. త‌మిళ‌,తెలుగు రెండు భాష‌ల‌లో రితికానే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా విజ‌యం సాధించినా కూడా ఆమెకు అవ‌కాశాలు మాత్రం పెద్ద‌గా రాలేదు.

అయితే తాజాగా ఆమెకు మెగా కాంపౌండ్ నుండి పిలుపు వ‌చ్చింద‌ని స‌మాచారం. ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమల మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రితికా సింగ్‌ను తీసుకుంటున్నారని స‌మాచారం. ఇది ఆమె కెరీర్‌కు బాగా ఉపయోగ పడుతుందని అంటున్నారు ఫ్యాన్స్. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వ‌చ్చే నెల‌లో ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది.

ఇకపోతే సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం తేజ్ ఐ లవ్ యు సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు. ప్రేమకథ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.