15 ఏళ్ల తర్వాత సల్మాన్‌తో ఐష్.. కానీ!

Salman Khan Aishwarya Rai To Share Screen After 15 Years

The former lovers Salman Khan and Aishwarya Rai to share screen after 15 years. Tollywood and sensational news updates Neticinema is one among the best. Experience the unique presentation of articles for the film industry latest updates and trending news.

అప్పుడెప్పుడో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్‌లు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలినట్లు అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టేశాయి. వాటిని నిజం చేస్తూ ఈ ప్రేమజంట రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సందర్భాలూ ఉన్నాయిలెండి. అయితే.. కొన్నాళ్ళ తర్వాత సల్మాన్ కేసుల్లో చిక్కుకోవడం, ఐష్ అతని నుంచి దూరమవ్వడం, అనంతరం కొందరితో డేటింగ్ చేశాక ఫైనల్‌గా అభిషేక్‌ని పెళ్ళి చేసుకోవడం.. అంతా చకచకా జరిగిపోయింది. ఏదేమైనా.. సల్మాన్, ఐష్ విడిపోయాక ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని.. ఇక వీళ్ళు కలవడం అసాధ్యమని అంతా ఫిక్సయ్యారు. అనుకున్నట్లుగానే ఈ జంట దాదాపు 15 ఏళ్లు కలుసుకోలేదు. కానీ.. ఇన్నాళ్ళ తర్వాత ఈ జంట మళ్ళీ కలవబోతోంది.

Read in English : AISH ON A ROLL

నిజానికి.. ఈ జంట చాలాకాలం క్రితమే వెండితెరను పంచుకోవాల్సింది కానీ ఐశ్వర్య ప్రతిసారీ సల్మాన్‌తో కలిసి నటించేందుకు తిరస్కరిస్తూ వచ్చింది. ఇందుకు కారణం.. గత అనుభవాలేనని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడు ఈ అమ్మడు అందరికీ షాక్ తగిలేలా సల్మాన్‌తో కలిసి తెరను పంచుకునేందుకు సై అని చెప్పింది. సరైన కథ ఉంటే సల్మాన్ సరసన హీరోయిన్గా నటించడానికి రెడీ అంటూ తేల్చి చెప్పేసింది. తన తాజా చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తాను సల్మాన్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ తెగేసి సమాధానం చెప్పింది. అయితే.. ఈ కాంబినేషన్ కుదరడానికి చాలా సమయమే పడుతుంది. మరీ అంతవరకు వెయిట్ చేయాలా? అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ జంట బుల్లితెరపైనే కలిసి కనిపించనున్నారు.

సల్మాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకు త్వరలో ఐశ్వర్యారాయ్ గెస్ట్గా హాజరు కానుందట. ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి ఐష్ అంగీకరించింది. దాదాపు 15 ఏళ్లుగా ఏ సందర్భంలోను ఎదురుపడని ఐష్, సల్మాన్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో ఈ విషయంలో బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.