తట్టుకోలేక తారక్‌కి ఫోన్..!

Tellmeboss.net

‘జై లవకుశ’ చిత్రంలో నటరుద్ర ఎన్టీఆర్ చూపించిన నటవిశ్వరూపానికి ఏ రేంజులో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. స్వయంగా కళామతల్లే ఒడిలో ఎత్తుకుని ముద్దాడే రేంజులో నటించి.. ఇండస్ట్రీ పెద్దలతో ‘జై’హో అని అనిపించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి ఎందరో ప్రముఖులు ఈపాటికే తారక్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారు. ముఖ్యంగా.. నవయుగ రావణుడిగా అలరించిన ‘జై’ పాత్రకి ఫిదా అయి, సోసల్ మీడియా ద్వారానే కాకుండా నేరుగా తారక్‌కి ఫోన్ చేసి ప్రశంసించారు. వీరి జాబితాలో తాజాగా సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు.

Tellmeboss.net

నిజానికి.. తారక్‌కి సల్మాన్ పెద్ద ఫ్యాన్. గతంలోనూ హైదరాబాద్‌కి వచ్చిన ప్రతీసారి తారక్ ప్రస్తావన తీసుకురావడంతోపాటు అతని నటనని మెచ్చుకున్నాడు కూడా! అలాంటి తారక్ నుంచి ‘జై లవకుశ’లాంటి బ్రహ్మాండమైన సినిమా వచ్చిందని రీసెంట్‌గా తెలుసుకుని.. సల్మాన్ చూశాడు. ఇన్నాళ్లు ‘టైగర్ జిందా హై’ షూటింగ్ కారణంగా చూడలేకపోయిన ఈ కండలవీరుడు.. కాస్త రెస్ట్ దొరకడంతో రీసెంట్‌గా తరించాడు. ఇంకేముంది.. సినిమా చూసి తారక్ నటనకు ఫిదా అయిపోయాడు. అంతే.. ఎగ్జైట్‌మెంట్ తట్టుకోలేక వెంటనే తారక్‌కి ఫోన్ చేశాడు.

‘జై లవకుశ’లో అద్భుతమైన నటన ప్రదర్శించావని.. నీ యాక్టింగ్‌కి హ్యాట్సాఫ్ అని తారక్‌ని సల్మాన్ కొనియాడాడు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బాబీని సైతం అప్రిషియేట్ చేశాడట. దీంతో.. అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సల్మాన్‌లాంటి స్టార్ హీరో నుంచి ఫోన్ రావడం తెలుసుకుని.. యూనిట్ చాలా సంతోషంగా ఉందని టాక్ వినిపిస్తోంది.

Tellmeboss.net
Related posts:
గబ్బర్‌సింగ్ 2లో అనీషా అవుట్.... మాజీ లవర్‌తో హన్సిక 4 రోజుల రొమాన్స్
త‌్వ‌ర‌లో.. "బుజ్జిగాడు " బీజేపీ లోకి !
క‌బ్జా చేస్తున్న నాని..వాళ్లిద్ద‌రికి తిప్ప‌లే!!
టాలీవుడ్‌పై రాంచ‌ర‌ణ్ షాకింగ్ కామెంట్స్‌!!
ఎన్ని కొట్లిచ్చినా ఇవ్వనంటూ నిర్మాతకు ఝలకిచ్చిన నాగ్
రాజసం.. పౌరుషం.. లీకైన డైలాగ్ తో దుమ్ము లేపుతున్న సైరా..!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.