ముందు సమంతనే మహా‘నటి’.. కానీ డైరెక్టర్ నహీ!

Tellmeboss.net

అలనాటి నటి సావిత్రి జీవిత గాథతో ఓ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారని వార్త రాగానే.. టైటిల్ రోల్‌లో ఎవరు నటిస్తారా? అనే ఆసక్తి తీవ్రస్థాయిలో నెలకొంది. ఖచ్చితంగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో ఎవరో ఒకరు నటించే ఛాన్స్ ఉందని అనుకున్నారు. తీరా చూస్తే.. కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్లు యూనిట్ స్వయంగా వెల్లడించింది. అలాగే.. సమంత కూడా ఓ కీలకపాత్ర పోషిస్తుందని మేకర్స్ తెలిపారు.

అంతే.. అప్పటినుంచి ఇండస్ట్రీలో ఒకటే చర్చ! ‘సమంతలాంటి స్టార్ హీరోయిన్‌ని పక్కనపెట్టేసి, కీర్తిని ‘సావిత్రి’గా ఎందుకు ఎంపిక చేశారు? దాని వెనుక ఏమైనా సీక్రెట్ ఉందా? అయినా సమంత అంత పెద్ద పాత్రని కాకుండా వేరే రోల్‌కి ఎలా ఒప్పుకుంది?’ అనే రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. వీటికి ఎప్పుడెప్పుడు సమాధానం దొరుకుతుందా? అని వెయిట్ చేయగా.. చివరికి ఈ చిత్ర నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వాటికి జవాబిచ్చింది. నిజానికి.. టైటిల్ రోల్‌కు కీర్తి కంటే ముందు సమంతనే తీసుకోవాలని అనుకున్నారని, ఆమె సైత్ కూడా చేసిందని స్వప్న తెలిపింది.

Tellmeboss.net

అయితే.. డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ‘సావిత్రి’ పాత్రని కొత్త హీరోయిన్ చేస్తే బాగుంటుందని ఫీలయ్యాడని, అందుకే సమంత ప్లేస్‌లో కీర్తిని ఎంపిక చేశామని స్వప్న వెల్లడించింది. డైరెక్టర్ అభిప్రాయంతో ఏకీభవించిన సమంత కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుని సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయడానికి ఓకే చెప్పిందని ఆమె తెలిపింది. ఈ చిత్రానికి కీర్తి సైన్ చేసే టైంలో పెద్దగా పాపులర్ అవ్వలేదని, ఇప్పుడు ఇతర సినిమాలు రిలీజ్ కావడంతో ఆమె బాగా ఫేమస్ అయ్యిందని స్వప్న చెప్పుకొచ్చింది. ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మళయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ కానుంది.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.