సమ్మోహనం 10 డేస్ కలెక్షన్స్!

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సమ్మోహనం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది. హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ క్రియేట్ చేసింది. అందాల భామ అదితి రావు హైదరీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

మంచి కథ-కథనం ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. మొదటి వారాంతం వరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో రన్ అవగా, వీకెండ్ ముగిసిన తరువాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. దీంతో 10 రోజులు పూర్తి చేసుకున్న సమ్మోహనం చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 6.13 కోట్లు కలెక్ట్ చేసింది. యావరేజ్ హిట్‌గా మిగలనున్న ఈ సినిమా కొంతమేర నష్టాలను మిగిల్చడం మాత్రం పక్కా. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర 10 రోజుల షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 10 రోజుల వరల్డ్‌వైడ్ షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 1.50
సీడెడ్ – 0.51
ఉత్తరాంధ్ర – 0.61
గుంటూరు – 0.31
కృష్ణా – 0.43
ఈస్ట్ – 0.39
వెస్ట్ – 0.21
నెల్లూరు – 0.17
టోటల్ ఏపీ+తెలంగాణ – 4.13
రెస్టాఫ్ ఇండియా – 0.30
ఓవర్సీస్ – 1.70
టోటల్ వరల్డ్‌వైడ్ – 6.13 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.