సమ్మోహనం ఫస్ట్ వీకెండ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సమ్మోహనం ఇటీవల రిలీజ్ అయ్యి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. సక్సెస్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో ఈ చిత్రం కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఇక క్లాస్ ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ జనాలు ఈ సినిమా చూసి నిజంగా సమ్మోహనానికి గురయ్యారు. పూర్తి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన అదితి రావు హైదరీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.3.79 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించింది.

ఏరియాల వారీగా ఈ చిత్ర ఫస్ట్ వీకెండ్ షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – ఫస్ట్ వీకెండ్ షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 0.88 కోట్లు
సీడెడ్ – 0.28 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.30 కోట్లు
గుంటూరు – 0.21 కోట్లు
తూర్పు గోదావరి – 0.21 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.15 కోట్లు
కృష్ణా – 0.20 కోట్లు
నెల్లూరు – 0.10 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 2.33 కోట్లు
ఓవర్సీస్ – 1.08 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 0.38 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 3.79 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.