సుధీర్ బాబు, అదితిరావు హైదరీల సమ్మోహనం రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

నటీనటులు: సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రీ, సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి తదితరులు
మ్యూజిక్: వివేక్ సాగ‌ర్‌
ఎడిటర్: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
ప్రొడ్యూసర్‌: శివ‌లెంక కృష్ణప్రసాద్‌
డైరెక్టర్: ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ

యంగ్ హీరో సుధీర్ బాబు విభిన్నమైన సినిమాలు చూస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. తాజాగా సమ్మోహనం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో అందాల బ్యూటీ అదితి రావు హైదరీ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
విజయ్ కుమార్(సుధీర్ బాబు) తన తల్లిదండ్రులతో ఆనందంగా జీవిస్తుంటాడు. తనకు సినిమావాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ క్రమంలో అతడి తండ్రి శర్వా (నరేష్) రిటైర్ అయినా కూడా సినిమాలపై ఇష్టంతో ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. తన ఇంటిని సినిమా షూటింగ్స్ కోసం అద్దెకు ఇస్తుంటాడు. ఈ క్రమంలో ఒక సినిమా వారికి షూటింగ్ నిమిత్తం తన ఇల్లు అద్దెకు ఇచ్చిన శర్వా ఆ సినిమాలో తనకు ఒక పాత్ర ఇవ్వాల్సిందిగా అడుగుతాడు. ఈ సినిమాలో హీరోయిన్ సమీరా రాథోడ్(అదితి రావు హైదరీ)కి తెలుగు అంతగా రాకపోవడంతో విజయ్‌ను తెలుగు టీచర్‌గా పెట్టుకుంటుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ వికసిస్తుంది. కట్ చేస్తే.. విజయ్ తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు సమీరా అతడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. సమీరా విజయ్ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది..? విజయ్ తన ప్రేమను ఎలా సాధిస్తాడు..? చివరికి వీరిద్దరు కలుస్తారా లేదా అనేది సినిమా స్టోరి.

విశ్లేషణ:
ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు కేరాఫ్‌ అయిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన సమ్మోహనం చిత్రం కూడా అదే స్థాయిలో తెరకెక్కింది. సినిమాల మీద పెద్ద‌గా ఒపీనియ‌న్ లేని హీరోకీ, న‌ట‌నే ప్రాణంగా భావించి స‌క్సెస్‌లో ఉన్న అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థ‌ను సమ్మోహనం చిత్రంలో కళ్లకు కట్టాడు దర్శకుడు.

ఫస్టాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల మధ్య జరిగే కెమిస్ట్రీని చాలా అందంగా చూపించాడు దర్శకుడు. ఆకట్టుకునే కథతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడా మిస్ కాకుండా చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. సుధీర్ బాబు, అదితి రావుల ఎక్స్‌ప్రెషన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. హీరో ప్రేమను రిజెక్ట్ చేసే పాయింట్‌తో అదిరిపోయే ఇంటర్వల్ బ్యాంగ్‌ను చూపించాడు డైరెక్టర్.

ఇక సెకండాఫ్‌లో హీరోయిన్ ఫ్లాష్‌బాక్ సీన్లు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతారు. అయితే నరేష్ కామెడీ ఈ బోర్‌ను కాస్త మైమరపించేందుకు ఉపయోగపడింది. హీరో హీరోయిన్ ఎలా కలుసుకున్నారు అనే పాయింట్‌ను మనకు క్లైమాక్స్‌లో చూపించిన ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేశాడు ఇంద్రగంటి. ఓవరాల్‌గా చూస్తే ఒక చక్కటి ప్రేమకథతో మనల్ని సమ్మోహనం చేసాడు డైరెక్టర్.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సుధీర్ బాబు ఈ చిత్రంలో చాలా చక్కటి పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తన గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్టింగ్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేశాడు. అదితి రావు హైదరీ కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. ఆమె చెప్పే తెలుగు డైలాగులు బాగా సింక్ అవడంతో అదితి చాలా చక్కగా తెలుగు మాట్లాడింది అని మెచ్చుకున్నారు జనాలు. ఇక వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ సూపర్. అటు సీనియర్ నరేష్ కామెడీ కూడా ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. తనికెళ్ల భరణి కూడా బాగా చేశారు. మిగతా వారు తమ పరిధిమేర బాగా నటించి ఆకట్టుకున్నారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన సినిమాలు ఎందుకు పాపులర్ అవుతాయో మరోసారి ప్రూవ్ చేశాడు. ఆకట్టుకునే కథకు తనదైన మార్క్ వేసి జనాల్లోకి తీసుకెళ్లడంలో ఇంద్రగంటి సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు కథ ఎంతటి బలాన్ని ఇచ్చిందో అంతే బలాన్ని ఇచ్చింది సినిమాటోగ్రాఫి. పిజి విందా తన అద్భుతమైన కెమెరా పనితనంతో ప్రేక్షకులను సమ్మోహనం చేశాడు. వివేక్ సాగర్ అందించిన సంగీతం ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగుండటంతో ఈ సినిమా చాలా రిచ్‌గా కనిపించింది.

చివరిగా:
సమ్మోహనం – మంచి కథతో మెప్పించిన ఇంద్రగంటి!

రేటింగ్: 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.